From MS Dhoni to Sam Curran
IPL auctions : మంగళవారం దుబాయ్ వేదికగా మినీ వేలాన్ని నిర్వహిస్తున్నారు. 10 ప్రాంచైజీల్లో కలిపి మొత్తం 77 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 30 స్లాట్స్ విదేశీ ఆటగాళ్లకు సంబంధించినవే. మొత్తం 333 మంది ప్లేయర్లు మినీ వేలంలో తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. భారత దేశంలో కాకుండా మొట్టమొదటి సారి వేలాన్ని దేశం బయట నిర్వహిస్తున్నారు. ఎవరు అత్యధిక ధర పలుకుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఇప్పటి వరకు జరిగిన వేలాల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు ఎవరో ఓ సారి పరిశీలిద్దాం..
2008లో ఎంఎస్ ధోని..
ఐపీఎల్ 2008లో ఆరంభమైంది. ఆరంభ సీజన్‌లో వేలాన్ని నిర్వహించగా అత్యంత ఖరీదైన ఆటగాడిగా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిలిచాడు. కెప్టెన్ కూల్ కోసం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. చివరకు రూ.9.50 కోట్లను వెచ్చింది చెన్నై జట్టు ధోనిని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి చెన్నై జట్టుకు ధోనినే నాయకత్వం వహిస్తున్నాడు. అతడి సారథ్యంలో చెన్నై 5 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. 2010, 2014లో జరిగిన రెండు ఛాంపియన్స్ లీగ్ T20 టైటిళ్లను కూడా సొంతం చేసుకుంది.
2009లో ఆండ్రూ ఫ్లింటాఫ్, కెవిన్ పీటర్సన్..
2009లో జరిగిన వేలంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.9.80 కోట్లకు కొనుగోలు చేసింది. అటు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను రూ.9.80 కోట్లు వెచ్చింది దక్కించుకుంది.
2010లో షేన్ బాండ్, కీరన్ పొలార్డ్..
2010 వేలంలో న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్ ను రూ.4.80 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అతడు ఎనిమిది మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. అదే సమయంలో ముంబై ఇండియన్స్ వెస్టిండీస్‌కు చెందిన కీరన్ పొలార్డ్‌ను రూ.4.80కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.
2011లో గౌతమ్ గంభీర్..
2011 వేలంలో భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.14.90 కోట్లకు కొనుగోలు చేసింది. అతడి నాయకత్వంలో కోల్‌కతా 2012, 2014 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది.
2012లో రవీంద్ర జడేజా..
2012 వేలంలో భారత ఆల్ రౌండర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ.12.80 కోట్లు వెచ్చించింది. 2011లో కొచ్చి టస్కర్స్ జట్టును రద్దు చేసిన తరువాత జడేజా వేలంలోకి అందుబాటులోకి వచ్చాడు. చెన్నై జట్టు మూడు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకోవడంతో జడేజా తన వంతు పాత్ర పోషించాడు.
2013లో గ్లెన్ మాక్స్‌వెల్..
2013 వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 6.30 కోట్లకు తీసుకుంది. అయితే.. అతను కేవలం మూడు మ్యాచులు మాత్రమే ఆడాడు. 18 సగటుతో 36 పరుగులు మాత్రమే సాధించాడు. తర్వాత అతను కింగ్స్ XI పంజాబ్‌కు మారాడు. ఇప్పుడు IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు.
2014లో యువరాజ్ సింగ్..
భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 2014 వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యువరాజ్ ను రూ.14 కోట్లకు సొంతం చేసుకుంది. ఆసీజన్‌లో యువీ 14 మ్యాచ్‌ల్లో 376 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆర్‌సీబీ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
2015లోనూ యువరాజ్ సింగ్..
2015లో జరిగిన ఐపీఎల్ వేలంలో యువరాజ్ ఆర్‌సీబీ నుంచి ఢిల్లీకి మారాడు. రూ.16 కోట్లు ఢిల్లీ అతడికి చెల్లించింది. ఆ సీజన్ యువీ 14 ఇన్నింగ్స్‌లలో 19.07 సగటుతో 248 పరుగులు చేశాడు.
Naveen Ul Haq : నవీన్ ఉల్ హక్ పై 20 నెలల నిషేదం.. మ్యాంగో మ్యాన్ చేసిన తప్పేంటి..?
2016లో షేన్ వాట్సన్..
ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ 2016లో జరిగిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. వేలంలో ఆర్‌సీబీ అతడిని 9.50 కోట్లకు దక్కించుకుంది. వాట్సన్ ఆ సీజన్‌లో ఆర్‌సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా నిలిచాడు. 16 మ్యాచ్‌లలో 20 వికెట్లు పడగొట్టగా.. 179 పరుగులు చేశాడు.
2017లో బెన్ స్టోక్స్..
ఐపీఎల్ 2017 వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ అతడిని రూ.14.50 కోట్లకు ససొంతం చేససుకుంది.
2018లో బెన్ స్టోక్స్..
రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి వచ్చిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ స్టోక్స్‌పై పెద్ద మొత్తం వెచ్చింది. 2018 వేలంలో అతడిని రూ.14.50 కోట్లకు సొంతం చేససుకుంది.
2019లో జయదేవ్ ఉనద్కత్, వరుణ్ చక్రవర్తి..
ఐపీఎల్ 2019 వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ.8.40 కోట్లకు జయదేవ్ ఉనద్కత్‌ను దక్కించుకుంది. అదే సమయంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.8.40 కోట్లకు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని దక్కించుకుంది.
2020లో పాట్ కమిన్స్..
ఐపీఎల్ 2020 వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 15.50కోట్లకు సొంతం చేసుకుంది. ఆ సీజన్ లో అతడు 14 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 146 పరుగులు చేశాడు.
2021లో క్రిస్ మోరిస్..
దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ 2021 వేలంలో రాజస్థాన్ రాయల్స్‌కు రూ. 16.50 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. ఆ సీజన్‌లో మోరిస్ 11 మ్యాచ్‌లలో 136.73 స్ట్రైక్ రేట్‌తో 67 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టాడు.
2022లో ఇషాన్ కిషన్..
ఐపీఎల్ 2022 వేలంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. అతడిని ముంబై ఇండియన్స్ రూ.15.25 కోట్లుకు కొనుగోలు చేసింది. ఆసీజన్ ఇషాన్ 14 మ్యాచ్‌లు ఆడాడు. 418 పరుగులు చేశాడు స్టంప్స్ వెనుక 13 క్యాచ్‌లు అందుకున్నాడు.
2023లో సామ్ కరన్..
పంజాబ్ కింగ్స్ 2023 వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్‌కరన్ కోసం పెద్ద మొత్తంలో వెచ్చించింది. టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా రూ.18.50 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో కర్రాన్ 10 వికెట్లు పడగొట్టడంతో పాటు 376 పరుగులు చేశాడు.