Gautam Gambhir : రాహుల్ ద్ర‌విడ్ స్థానాన్ని భ‌ర్తీ చేసేది ఎవ‌రు..? కొత్త కోచ్ రేసులో మొద‌టి స్థానంలో గౌత‌మ్ గంభీర్‌..?

టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ స్థానంలో ఎవ‌రు వ‌స్తారు ? అనే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

Gautam Gambhir – Rahul Dravid : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ స్థానంలో ఎవ‌రు వ‌స్తారు ? అనే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఆసీస్‌ మాజీ క్రికెటర్లను సంప్రదించలేదని, భార‌త క్రికెట్ నిర్మాణంపై లోతైన అవ‌గాహ‌న క‌లిగిన వ్య‌క్తినే నియ‌మిస్తామ‌ని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైషా చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇక ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఫైన‌ల్‌కు చేర‌డంతో ఆ జ‌ట్టుకు మెంటార్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు గౌత‌మ్ గంభీర్ ప్ర‌ధాన కోచ్‌గా అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే.. గంభీర్‌కు బోర్డు నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్రతిపాదన ఏదీ రాలేదని అత‌డి సన్నిహిత వ‌ర్గాలు చెప్పిన‌ట్లుగా ప‌లు రిపోర్టులు చెబుతున్నాయి. ఒక‌వేళ బోర్డు నుంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్ల‌యితే గంభీర్ దాన్ని స్వీక‌రించ‌డానికి సిద్ధంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే గంభీర్‌కు స‌వాళ్లు అంటే ఇష్టం..అందుక‌నే కోచింగ్‌ను అత‌డు ఛాలెంజ్‌గా తీసుకుంటాడ‌ని అంటున్నారు.

Pat Cummins : రాజ‌స్థాన్ పై విజ‌యం.. కెప్టెన్ క‌మిన్స్ కీల‌క వ్యాఖ్య‌లు.. టోర్నీ ఆరంభం నుంచి మా ల‌క్ష్యం ఒక్క‌టే..

కోల్‌క‌తా వ‌దులుకుంటుందా..?

గత రెండు సీజ‌న్ల‌లో కోల్‌క‌తా ప్ర‌ద‌ర్శ‌న దారుణంగా ఉంది. గంభీర్ మెంటార్ వ‌చ్చిన త‌రువాత ఆ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న గాడిన ప‌డింది. వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌కు దూసుకువ‌చ్చింది. ఈ క్ర‌మంలో గంభీర్‌ను వ‌దులుకునేందుకు కేకేఆర్ మేనేజ్‌మెంట్ ఇష్ట‌ప‌డుతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. అయితే.. గంభీర్ టీమ్ఇండియా కోచ్‌గా ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించుకుంటే మాత్రం కేకేఆర్ అత‌డి నిర్ణ‌యానికి అడ్డుచెప్ప‌క‌పోవ‌చ్చు.

కోచ్ కూడా కాదు..

గంభీర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సారి కూడా కోచ్‌గా వ్య‌వ‌హ‌రించ‌లేదు. అయితే.. అత‌డి శ‌క్తి, సామ‌ర్థ్యాలు ఏంటో ఐపీఎల్ ద్వారా ప్ర‌త్య‌క్షంగా చూస్తూనే ఉన్నాం. స్టార్ సంస్కృతికి గంభీర్ వ్య‌తిరేకం. ఏదీ చెప్పాల‌నుకున్న అత‌డు ముఖంపైనే చెబుతాడు. 2011లో అత‌డి నాయ‌కత్వంలో కేకేఆర్‌కు నాలుగు సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో రెండు సార్లు ఐపీఎల్ ట్రోపీల‌ను అందించాడు. ఈ సీజ‌న్‌లో మెంటార్‌గా జ‌ట్టుకు ఫైన‌ల్ కు చేర్చాడు. కెప్టెన్‌గా లేదా మెంటార్‌గా అయినా స‌రే .. ఆట‌గాళ్లు వ్య‌క్తిగ‌త మైలు రాళ్లను చూసి అత‌డు జ‌ట్టులో స్థానం క‌ల్పించ‌డు. మ్యాచ్‌లో జ‌ట్టును గెలిపించేందుకు ఆట‌గాడు ఎలా ఆడాడు అన్న‌దాని బ‌ట్టే ఉంటుంది.

Kavya Maran : ఫైన‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్ .. కావ్యా పాప సంబ‌రాలు చూశారా?

గంభీర్ ఆట‌గాళ్ల పై ఎంతో న‌మ్మ‌కం ఉంచుతాడు. ఓ ప్లేయ‌ర్ రాణించ‌క‌పోయినా అత‌డిని తుది జ‌ట్టులో కొన‌సాగిస్తాడు. అత‌డికి త‌గిన‌ని అవ‌కాశాల‌ను ఇస్తాడు. ఇందుకు మిచెల్ స్టార్క్ చ‌క్క‌ని ఉదాహార‌ణ‌. ఈ ఐపీఎల్‌కు ముందు మిచెల్ స్టార్క్‌ను వేలంలో కేకేఆర్ రూ.24 కోట్ల‌కు సొంతం చేసుకుంది. అత‌డిని ద‌క్కించుకోవ‌డంలో గంభీర్ పాత్ర ఎంతో ఉంది. ఈ నిర్ణ‌యం పై మొద‌ల్లో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఐపీఎల్ ఆరంభ మ్యాచుల్లో స్టార్క్ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఈ లెప్ట్ ఆర్మ్ పేస‌ర్ పై న‌మ్మ‌కం ఉంచి గంభీర్ అత‌డిని జ‌ట్టులో కొన‌సాగిస్తూ వ‌చ్చాడు. క్వాలిఫ‌య‌ర్ 1లో స్టార్క్‌ స‌త్తా చాటాడు. మొద‌టి బంతికే భీక‌ర ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్‌ను అత‌డు ఔట్ చేసి జ‌ట్టు గెలుపుకు బాటలు వేశాడు.

ట్రెండింగ్ వార్తలు