IND vs SL 3rd T20 : బంతితో మాయ చేసిన బ్యాట‌ర్లు సూర్య‌, రింకూ.. నెట్టింట గంభీర్ మీమ్స్ వైర‌ల్‌..

శ్రీలంక‌తో జ‌రిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భార‌త్ క్లీన్ స్వీప్ చేసింది.

Gambhir memes go viral after Surya and Rinku turn bowling heroes

IND vs SL : శ్రీలంక‌తో జ‌రిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భార‌త్ క్లీన్ స్వీప్ చేసింది. మంగ‌ళ‌వారం ప‌ల్లెక‌లె వేదిక‌గా జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భార‌త్ సూప‌ర్ ఓవ‌ర్‌లో విజ‌యం సాధించింది. వాస్త‌వానికి ఈ మ్యాచ్‌లో శ్రీలంక జ‌ట్టు విజ‌యం సాధిస్తుంద‌ని చాలా మంది భావించారు. అయితే.. బ్యాట‌ర్లు అయిన సూర్య‌కుమార్ యాద‌వ్, రింకూ సింగ్‌లు త‌మ బౌలింగ్‌తో మ్యాచ్‌ను మ‌లుపు తిప్పారు. వారి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది.

ఈ మ్యాచ్‌లో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 137 ప‌రుగులు చేసింది. అనంత‌రం శ్రీలంక జ‌ట్టు ల‌క్ష్య ఛేద‌న‌లో 8 వికెట్ల న‌ష్టానికి 137 ప‌రుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అనంత‌రం సూర్య‌కుమార్ తొలి బంతికే బౌండ‌రీ కొట్టి భార‌త్‌కు విజ‌యాన్ని అందించాడు.

Suryakumar Yadav : డేవిడ్ వార్న‌ర్ రికార్డు స‌మం.. కోహ్లీ రికార్డుకు ద‌గ్గ‌ర‌గా సూర్య‌కుమార్‌..

ఆఖ‌రి రెండు ఓవ‌ర్ల‌లో 9 ప‌రుగులు చేయ‌లేక‌..

ఈ మ్యాచ్‌లో ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన శ్రీలంక ఆఖ‌రి రెండు ఓవ‌ర్ల‌లో 9 ప‌రుగులు చేస్తే విజ‌యం సాధించేది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఈ విజ‌య స‌మీక‌ర‌ణం చూస్తే లంక ఈజీగా గెలుస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే.. ప్ర‌ధాన పేస‌ర్లు సిరాజ్‌, ఖ‌లీల్ అహ్మ‌ద్‌ల‌ను కాద‌ని రింకూ సింగ్ చేతికి బాల్ ఇచ్చాడు సూర్య‌. 19వ ఓవ‌ర్ వేసిన రింకూ సింగ్ కేవ‌లం మూడు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి కుశాల్ పెరీరా, ర‌మేష్ మెండిస్ వికెట్లును తీశాడు.

దీంతో లంక విజ‌య స‌మీక‌ర‌ణం ఆరు బంతుల్లో 6 ప‌రుగులుగా మారింది. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. ఈ సారి కెప్టెన్ సూర్య‌నే స్వ‌యంగా బౌలింగ్ వ‌చ్చాడు. తొలిసారి టీ20ల్లో బౌలింగ్ చేసిన అత‌డు క‌మింద్ మెండిస్, మ‌హేశ్ తీక్ష‌ణ‌ల‌ను ఔట్ చేసి కేవ‌లం ఐదు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది.

Rohit Sharma : ద‌టీజ్ రోహిత్ శ‌ర్మ‌.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ‘పుల్ షాట్’ పాఠాలు..

టీమ్ఇండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన బ్యాట‌ర్లు సూర్య‌కుమార్ యాద‌వ్‌, రింకూ సింగ్‌లు బంతితో మాయ చేయ‌డంతో సోష‌ల్ మీడియాలో మీమ్స్‌తో నిండిపోయింది. కోచ్ గంభీర్ వ‌ల్లే ఇలా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు