×
Ad

Gautam Gambhir : డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్‌ను ప్ర‌శంసించిన గంభీర్‌.. ఆఖ‌రిలో కోహ్లీ గురించి ఏమ‌న్నాడంటే..?

టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ (Gautam Gambhir ) కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

Gambhir Praises Rohit and Gill In Dressing Room Later Says This On Kohli

Gautam Gambhir : శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల జోడి రెండో వికెట్‌కు 168 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెల‌కొల్పి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రో-కో ద్వయం రాణించ‌డంతో వారిపై వ‌స్తున్న ఊహాగానాల‌కు దాదాపుగా తెర‌ప‌డింది. ఈ మ్యాచ్ త‌రువాత టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ (Gautam Gambhir ) కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. 46.4 ఓవ‌ర్ల‌లో 236 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆ త‌రువాత రోహిత్ శ‌ర్మ (121 నాటౌట్; 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), విరాట్ కోహ్లీ (74 నాటౌట్; 81 బంతుల్లో 7 ఫోర్లు) రాణించ‌డంతో 38.3 ఓవ‌ర్ల‌లో వికెట్ కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది. శుభ్‌మ‌న్ గిల్ (24) ప‌ర్వాలేద‌నిపించాడు.

Rohit Sharma : సెంచ‌రీ చేసిన త‌రువాతి రోజే రోహిత్ శ‌ర్మ ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. గుడ్ బై, ఇదే చివ‌రి సారి..

237 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో గిల్, రోహిత్ శ‌ర్మ జోడీ తొలి వికెట్‌కు 69 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. దీనిపై మ్యాచ్ అనంత‌రం డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ మాట్లాడాడు. ఈ భాగ‌స్వామ్యాన్ని ప్ర‌శంసించాడు. ఛేజింగ్‌లో ఇది కీల‌క భాగ‌స్వామ్యం అని అన్నాడు. ఆ త‌రువాత రెండో వికెట్‌కు అజేయంగా రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ మ‌ధ్య న‌మోదైన 168 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని అద్భుత‌మైన‌దిగా చెప్పుకొచ్చాడు.

‘ల‌క్ష్య ఛేద‌న‌లో వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసినప్పుడు శుభ్‌మ‌న్‌, రోహిత్ మధ్య భాగస్వామ్యం చాలా చాలా ముఖ్యమైనదని నేను భావించాను. ఆపై రోహిత్‌, విరాట్ మధ్య భాగస్వామ్యం మళ్ళీ అత్యద్భుతంగా ఉంది. ఇక్క‌డ సెంచ‌రీ చేసిన రోహిత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే రోహిత్‌, కోహ్లీ దానిని ముగించారు. ‘అని గంభీర్ అన్నాడు.

రోహిత్, కోహ్లీ ఇద్దరూ అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించ‌డం ప‌ట్ల గంభీర్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. ‘జట్టు దృక్కోణం నుండి కూడా ఇది చాలా ముఖ్యమైన విషయం అని నేను భావించాను. మ‌నం ఛేజింగ్ ఎలా చేయ‌గ‌ల‌మో చూపించారు’. అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

Womens World Cup 2025 : ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..

ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ, రోహిత్ ఇద్ద‌రికి కూడా ఇదే చివ‌రి ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న కావొచ్చున‌ని హిట్‌మ్యాన్ చెప్పాడు. ఎందుకంటే వారిద్ద‌రి అంత‌ర్జాతీయ కెరీర్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. న‌వంబ‌ర్‌లో ద‌క్షిణాప్రికాతో భార‌త్ మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్‌లోనే మ‌ళ్లీ రో-కో ద్వ‌యం క‌నిపించ‌నుంది.