Gautam Gambhir-Morne Morkel : బౌలింగ్ కోచ్‌తో గంభీర్‌కు విభేదాలు..! జ‌ట్టుతో అంటీముట్ట‌న‌ట్టుగానే ఉన్న మోర్కెల్‌..!

బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో గంభీర్‌కు విభేదాలు త‌లెత్తిన‌ట్లు స‌ద‌రు వార్త‌ల సారాంశం.

Gambhir scolded Morkel for turning up late for a practice session in Australia reports

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో ఆస్ట్రేలియా పై భార‌త్ 1-3 తేడాతో ఓడిపోయింది. అంతక ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతుల్లో టెస్టుల్లో వైట్‌వాష్‌కు గురైంది. ఈ ఓటముల నేప‌థ్యంలో భార‌త్ ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (WTC)2023-25 ఫైన‌ల్ రేసు నుంచి నిష్ర్క‌మించింది. దీంతో భార‌త జ‌ట్టులో ఏదో జ‌రుగుతుంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్రధాన ఆట‌గాళ్ల‌తో కోచ్ గౌత‌మ్ గంభీర్‌(Gautam Gambhir)కు ప‌డ‌డం లేద‌ని, ఆసీస్ పై ఓట‌మి అనంత‌రం డ్రెస్సింగ్స్ రూమ్‌లో ప్లేయ‌ర్ల పై గంభీర్ మండిప‌డిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కాగా.. తాజాగా మ‌రో వార్త వైర‌ల్ అవుతోంది.

బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌(Morne Morkel)తో గంభీర్‌కు విభేదాలు త‌లెత్తిన‌ట్లు స‌ద‌రు వార్త‌ల సారాంశం. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఓ ప్రాక్టీస్ సెష‌న్‌కు మోర్నీ మోర్కెల్ లేటుగా వ‌చ్చాడ‌ట‌. ఇది గంభీర్‌కు న‌చ్చ‌లేద‌ట‌. దీంతో మైదానంలోనే ద‌క్షిణాఫ్రికా పాస్ట్ బౌల‌ర్‌ను గంభీర్ మంద‌లించాడ‌ట‌. గంభీర్ ప్ర‌వ‌ర్త‌న‌తో మోర్నీ మ‌న‌స్థాపం చెందాడ‌ని, ఈ క్ర‌మంలో అత‌డు మిగిలిన సిరీస్‌లో టీమ్‌తో అట్టీ ముట్ట‌న‌ట్లుగా ఉన్నాడ‌ని ఆంగ్ల మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

Smriti Mandhana : చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన‌.. వ‌న్డేల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన భార‌త ప్లేయ‌ర్‌గా..

కాగా.. త‌నకు స‌హాయ‌కులుగా గంభీర్ ప‌ట్టు బ‌ట్టీ మ‌రీ మోర్నీ మోర్నెల్‌, బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయ‌ర్‌, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డ‌స్చాట్ ల‌ను తెచ్చుకున్నాడు. గంభీర్ ప్ర‌ధాన కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత భార‌త్ 10 టెస్టులు ఆడ‌గా అందులో 6 మ్యాచుల్లో ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో అత‌డిపై బీసీసీఐ కాస్త గుర్రుగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్ గ‌నుక పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేస్తే గంభీర్ సీటుకే ఎస‌రు రావొచ్చున‌ని క్రీడా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇదిలా ఉంటే.. భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడ‌నుంది. తొలుత టీ20లు, ఆ త‌రువాత వ‌న్డేలు ఆడ‌నుంది. 5 మ్యాచుల టీ20 సిరీస్ జ‌న‌వ‌రి 22 నుంచి ఆరంభం కానుండ‌గా ఫిబ్ర‌వ‌రి 6 నుంచి వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టును ఇప్ప‌టికే బీసీసీఐ ప్ర‌క‌టించింది. సూర్య‌కుమార్ యాద‌వ్ నాయ‌క‌త్వంలో భార‌త్ బ‌రిలోకి దిగ‌నుంది.

Tilak Varma – Vijay Devarkonda : టీమ్ఇండియా యువ క్రికెట‌ర్ తిల‌క్ వ‌ర్మ‌తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. పిక్ వైర‌ల్..

భార‌త్‌, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
జనవరి 22న తొలి టీ20 మ్యాచ్ – వేదిక‌ కోల్‌కతా
జనవరి 25న రెండో టీ20 మ్యాచ్ – వేదిక‌ చెన్నై
జనవరి 28న మూడో టీ20 మ్యాచ్ – వేదిక రాజ్‌కోట్
జనవరి 31న – నాలుగో టీ20 మ్యాచ్ – వేదిక పూణె
ఫిబ్రవరి 2న – ఐదో టీ20 మ్యాచ్ – వేదిక‌ ముంబై.