Gautam Gambhir Asks BCCI To Take Call On His Future
Gautam Gambhir : గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ 408 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది. కాగా.. భారత దేశంలో దక్షిణాప్రికా జట్టు 25 ఏళ్ల తరువాత టెస్టు సిరీస్‌ను గెలవడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో ఓటమి అనంతరం టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశ్నల వర్షం కురిసింది. టెస్టు క్రికెట్‌లో అతడి భవిష్యత్తు గురించి అడిగినప్పుడు.. తాను కోచ్‌గా కొనసాగాలా వద్దా అనే అంశాన్ని బీసీసీఐ నిర్ణయిస్తుందన్నాడు.
Gambhir said “People keep forgetting it. I am the same guy who got results in England with a young team. You guys will forget very soon. A lot of people keep talking about New Zealand. I am the same guy under whom we won the Champions Trophy and the Asia Cup as well. This is a… pic.twitter.com/tc0XmfcyaY
— Johns. (@CricCrazyJohns) November 26, 2025
‘ఈ నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకోవాలి. నేను ఇంతకు ముందే చెప్పాను. దేశమే ప్రధానం. నేను కాదు. భారత్ ఇటీవల ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌ను సమం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్‌లను సైతం సొంతం చేసుకుంది. అప్పుడు నేనే కోచ్‌గా ఉన్నా, ఇప్పుడు నేనే కోచ్‌గా ఉన్నా. ఇది నేర్చుకుంటున్న జట్టు.’ అని గంభీర్ అన్నాడు.
అందరూ బాధ్యత వహించాల్సిందే..
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమికి అందరూ బాధ్యత వహించాలన్నారు. ఏ ఒక్కరిని నిందించలేరన్నారు. ఇక నిందలు తనతోనే మొదలు అవుతాయని చెప్పుకొచ్చాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించాలంటే సమిష్టి కృషి అవసరం అని తెలిపాడు.
IND vs SA : రెండో టెస్టులో చిత్తు చిత్తుగా ఓడిన భారత్.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలను చేపట్టిన తరువాత భారతదేశం ఇప్పటి వరకు 18 టెస్టులు ఆడింది. ఇందులో 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 క్వీన్ స్లీప్ ఓటములు కూడా ఉన్నాయి.