IND vs BAN : బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌కు నో ప్లేస్ అన్న గంభీర్‌..

బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌కు రంగం సిద్ధ‌మైంది.

Gautam Gambhir confirms Rahul and Pant play in 1st Test

IND vs BAN 1st test : బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌కు రంగం సిద్ధ‌మైంది. చెన్నైలోని చెపాక్ వేదిక‌గా గురువారం భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. గాయాల కార‌ణంగా కొంత కాలం పాటు జ‌ట్టుకు దూరం అయిన కీల‌క ఆట‌గాళ్ల‌లో చాలా మంది అందుబాటులోకి వ‌చ్చారు. వీరి గైర్హాజ‌రీలో యువ ఆట‌గాళ్లు రాణించారు. దీంతో తుది జ‌ట్టు కూర్పు ఎలా ఉండ‌నుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ముఖ్యంగా కేఎల్ రాహుల్-సర్ఫ‌రాజ్ ఖాన్‌, ధృవ్ జురెల్ – రిష‌బ్ పంత్ లలో ఎవ‌రికి తుది జ‌ట్టులో చోటు ద‌క్కుతుంద‌నే దానిపై ఆతృతగా ఉంది. దీనిపై టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ స్ప‌ష్ట‌త ఇచ్చాడు. కేఎల్ రాహుల్‌, రిష‌బ్ పంత్‌లు ఖ‌చ్చితంగా ఆడ‌తార‌ని చెప్పుకొచ్చాడు. ఫామ్‌తో పాటు వారి అనుభ‌వం జ‌ట్టుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నాడు. తుది జ‌ట్టులో ఛాన్స్ రానంత మాత్ర‌న వారిని త‌ప్పించిన‌ట్లు కాద‌ని అన్నాడు.

IPL 2025 : పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్‌.. ఢిల్లీ పొమ్మంటే..

ధ్రువ్ జురెల్ అద్భుత‌మైన ఆట‌గాడిని చెప్పుకొచ్చాడు. అయితే.. పంత్ రీఎంట్రీ ఇవ్వ‌డంతో అత‌డు త‌న స్థానం కోసం ఎదురుచూడాల్సి వ‌స్తుంద‌న్నాడు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ విష‌యంలోనూ దాదాపుగా ఇదే ప‌రిస్థితి ఉంద‌న్నాడు. ఈ ఇద్ద‌రికి ఖ‌చ్చితంగా ఛాన్సులు వ‌స్తాయ‌ని, అయితే దాని కోసం ఎదురుచూడాల‌న్నారు.

2022 డిసెంబ‌ర్‌లో పంత్ చివ‌రి సారి టెస్టు మ్యాచ్ ఆడాడు. అదే నెల చివ‌ర‌ల్లో రోడ్డు ప్ర‌మాదంలో పంత్ గాయ‌ప‌డ్డాడు. దీంతో ఆట‌కు దూరం అయ్యాడు. కోలుకుని ఐపీఎల్ 2024 నుంచి మైదానంలో అడుగుపెట్టాడు. పంత్ గురించి గంభీర్ మాట్లాడుతూ.. పంత్ ఎంత‌టి విధ్వంస‌క‌ర ఆట‌గాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పని లేద‌న్నాడు. అత‌డు ఏం చేయ‌గ‌ల‌డో అంద‌రికి తెలుసున‌ని చెప్పుకొచ్చాడు. అత‌డి బ్యాటింగ్‌, వికెట్ కీపింగ్ అద్భుతంగా ఉంటుంద‌ని తెలిపాడు.

ఇదే క‌దా మాకు కావాల్సింది.. ఫ్రెండ్స్ అయిపోయిన కోహ్లి, గంభీర్.. జోకులేసుకొని తెగ..

భారత తుది జట్టు (అంచనా)..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.