Glenn McGrath an epic reaction after Nathan Lyon surpassed him on an elite list
AUS vs ENG : ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆసీస్ ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. అడిలైడ్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ (AUS vs ENG)తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు.
ఈ క్రమంలో అతడు ఆసీస్ దిగ్గజ పేసర్ మెక్‌గ్రాత్‌ను అధిగమించాడు. 124 టెస్టుల్లో మెక్‌గ్రాత్ 563 వికెట్లు సాధించగా.. 141 టెస్టుల్లో లియోన్ 564 వికెట్లు పడగొట్టాడు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్లలో దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ అగ్రస్థానంలో ఉన్నాడు. షేన్ వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు సాధించాడు.
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్లు వీరే..
* షేన్ వార్న్ – 708 వికెట్లు
* నాథన్ లియోన్ – 564 వికెట్లు
* గ్లెన్ మెక్‌గ్రాత్ – 563 వికెట్లు
* మిచెల్ స్టార్క్ – 420 వికెట్లు
* డెన్నిస్ లిల్లీ – 355 వికెట్లు
And with that absolute beauty, Nathan Lyon has passed Glenn McGrath for Test wickets! 564 😱#Ashes | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/wTofukUsYD
— cricket.com.au (@cricketcomau) December 18, 2025
ఆరో స్థానంలో..
ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో నాథన్ లియోన్ ఆరో స్థానంలో నిలిచాడు. షేన్‌వార్న్, అండర్సన్, అనిల్ కుంబ్లే, స్టువర్ట్ బ్రాడ్‌లు అతడి కన్నా ముందు ఉన్నారు.
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* ముత్తయ్య మురళీధరన్ – 800 వికెట్లు
* షేన్ వార్న్ – 708 వికెట్లు
* జేమ్స్ అండర్సన్ – 704 వికెట్లు
* అనిల్ కుంబ్లే – 619 వికెట్లు
* స్టువర్ట్ బ్రాడ్ – 604 వికెట్లు
* నాథన్ లియోన్ – 564 వికెట్లు
Mangesh Yadav : ఆర్‌సీబీ కోట్లు కుమ్మరించిన మంగేష్ యాదవ్ ఎవరు? అతడి ట్రాక్ రికార్డు ఏంటి?
మెక్‌గ్రాత్ రియాక్షన్ వైరల్!
కాగా.. నాథన్ లియోన్ తన రికార్డును బ్రేక్ చేసిన సమయంలో గ్లెన్ మెక్‌గ్రాత్ కామెంటరీ చేస్తున్నారు. ఈ క్రమంలో నాథన్ వికెట్ తీయగానే మెక్‌గ్రాత్ సరదాగా తన పక్కన ఉన్న కుర్చీని లేచి విసిరేసినట్లుగా చేశాడు. అనంతరం లియోన్ ను అభినందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Glenn McGrath’s reaction to Nathan Lyon passing him on the all-time Test wickets list was absolutely hilarious 🤣 #Ashes pic.twitter.com/1jTM06M8me
— cricket.com.au (@cricketcomau) December 18, 2025