Jasprit Bumrah: బుమ్రా గురించి నా అభిప్రాయంతో నాజ‌ర్ హుస్సేన్ ఏకీభ‌వించారు: స‌చిన్

''ఓవ‌ల్ మైదానం బౌన్స్‌కు అనుకూలిస్తుంది. అయితే, భార‌త బౌల‌ర్లు చాలా చక్క‌గా బంతులు వేసి, ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా బుమ్రా అసాధార‌ణ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించాడు. అన్ని ఫార్మాట్ల‌లో బుమ్రానే అత్యుత్త‌మ బౌల‌ర్ అని చాలా కాలంగా నా అభిప్రాయం. ఓ కార్య‌క్ర‌మంలో ఇదే విష‌యంపై ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ నాజ‌ర్ హుస్సేన్ కూడా నా అభిప్రాయంతో ఏకీభ‌వించారు'' అని స‌చిన్ టెండూల్క‌ర్ ట్వీట్ చేశారు.

Sachin

Jasprit Bumrah: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న‌ వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జస్ప్రీత్‌ బుమ్రా (6/19)పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఇంగ్లండ్‌ను 25.2 ఓవర్లలో 110 పరుగులకే భార‌త్ కుప్పకూల్చిన విష‌యం తెలిసిందే. దీంతో జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూడా కొనియాడారు.

Afghan girls: తాలిబన్ల పాలనలో అగమ్యగోచరంగా అఫ్గాన్ బాలికల పరిస్థితి

”ఓవ‌ల్ మైదానం బౌన్స్‌కు అనుకూలిస్తుంది. అయితే, భార‌త బౌల‌ర్లు చాలా చక్క‌గా బంతులు వేసి, ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా బుమ్రా అసాధార‌ణ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించాడు. అన్ని ఫార్మాట్ల‌లో బుమ్రానే అత్యుత్త‌మ బౌల‌ర్ అని చాలా కాలంగా నా అభిప్రాయం. ఓ కార్య‌క్ర‌మంలో ఇదే విష‌యంపై ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ నాజ‌ర్ హుస్సేన్ కూడా నా అభిప్రాయంతో ఏకీభ‌వించారు” అని స‌చిన్ టెండూల్క‌ర్ ట్వీట్ చేశారు. కాగా, బుమ్రా అన్ని ఫార్మాట్ల‌లో ప్ర‌పంచంలోనే ఉత్త‌మ బౌల‌ర్ అని నాజ‌ర్ స్కై స్పోర్ట్స్ లోనూ ఓ ఆర్టిక‌ల్ రాశారు. కాగా, ఇంగ్లండ్, భార‌త్ మ‌ధ్య‌ రెండో వన్డే రేపు జరుగుతుంది.