Maria Sharapova : తల్లికాబోతున్న టెన్నిస్ స్టార్ మారియా షరపోవా.. 35వ పుట్టినరోజున వెల్లడి..!
Maria Sharapova : రష్యా టెన్నిస్ స్టార్, ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్ మారియా షరపోవా గుడ్ న్యూస్ చెప్పింది. తాను త్వరలో తల్లికాబోతున్నట్టు తన ఇన్‌స్టా వేదికగా షరపోవా తెలిపింది.

Grand Slam Champ Maria Sharapova Announces Pregnancy On 35th Birthday
Maria Sharapova : రష్యా టెన్నిస్ స్టార్, ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్ మారియా షరపోవా గుడ్ న్యూస్ చెప్పింది. తాను త్వరలో తల్లికాబోతున్నట్టు తన ఇన్‌స్టా వేదికగా షరపోవా వెల్లడించింది. ‘నా జీవితంలో మధురమైన క్షణాలు ఎంతో మొదలయ్యాయి..’ తాను గర్భవతి అయ్యాయననే విషయాన్ని షరపోవా తన అభిమానులతో షేర్ చేసుకుంది. బీచ్‌లో తాను నిలబడి ఉన్న ఫొటోను షేర్ చేసింది.
తల్లి కాబోతున్నానే అందమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నానంటూ తన బేబీ బంప్ చూపిస్తూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఈ రోజు 35ఏటా పుట్టినరోజు జరుపుకుంటున్నాను. ప్రతి ఏడాది నేను ఒక్కదాన్నే పుట్టినరోజు జరుపుకున్నాను. కేకు కూడా ఒకదాన్నే తిన్నాను. ఈసారి మేమిద్దరం.. ఇప్పుడు నాతో పాటు నా కడుపులోని బేబీ కూడా కేక్ తింటుంది.. ఇది నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు అంటూ వైట్ హార్ట్, ఎమోజీతో ఆమె పోస్టు పెట్టింది.
టెన్నీస్ ప్లేయర్ ఇలా సర్ ఫ్రైజింగ్ ప్రకటన చేయడం ఇదేం తొలిసారి కాదు.. 2020 డిసెంబర్‌లో బ్రిటన్ కు చెందిన బడా వ్యాపారవేత్త అలెగ్జాంర్ గిల్కెస్‌తో ఎంగేజ్ మెంట్ అయినట్టు ప్రకటించింది. స్క్వైర్డ్ సర్కిల్స్ సంస్థ సహా వ్యవస్థాపకుడిగా ఉన్న గిల్కెస్‌తో షరపోవా 2018 నుంచి రిలేషన్ షిప్‌లో ఉంది.
View this post on Instagram
అలా సాగిన వారి జీవితంలోకి మూడో వ్యక్తికి రాబోతున్నాడు.. ఆ బేబీకి వెల్ కమ్ చెప్పేందుకు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామంటోంది. వీరిద్దరు త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తన కెరీర్‌లో 5 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సొంతం చేసుకున్న షరపోవా.. 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పేసింది.
Read Also : క్షమాపణ కోరుతూ లక్షల్లో మెసేజ్‌లు.. షరపోవా కన్‌ఫ్యూజ్..!