IPL 2024 : శుభ్‌మన్‌ గిల్‌కు బిగ్‌షాక్‌.. భారీ జరిమానా! ఎందుకంటే?

శుభ్‌మన్‌ గిల్‌కు బిగ్ షాక్ తగిలింది. రూ. 12లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది.

CSK vs GT Match : శుభ్‌మన్‌ గిల్‌కు బిగ్ షాక్ తగిలింది. రూ. 12లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ కు ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. రూ. 12లక్షల జరిమానా విధించారు. మ్యాచ్ ముగిసిన తరువాత ఈ విషయాన్ని పేర్కొంటూ ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది.

Also Read : IPL 2024 : ధోనీ అద్భుత క్యాచ్.. ఒక్కసారిగా హోరెత్తిన స్టేడియం.. సురేశ్ రైనా ఏమన్నాడంటే?

గుజరాత్ టైటాన్స్ బౌలర్లు సమయానికి ఓవర్లు పూర్తి చేయకపోవటం వల్ల ఈ జరిమానా విధించినట్లు ఐపీఎల్ పేర్కొంది. మినిమమ్ ఓవర్ రేటుకు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభమాన్ గిల్ కు రూ. 12లక్షల జరిమానా విధించినట్లు ప్రకటనలో పేర్కొంది. ఇదిలాఉంటే.. ఈ సీజన్ లో మొదటి జరిమా ఎదుర్కొంది గిల్ కావటం గమనార్హం. ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ ఐదు బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు తొలి మ్యాచ్ లో ముంబై జట్టుపై విజయం సాధించింది. రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

Also Read : IPL 2024 : ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి కుక్క‌.. వారిపై జరిమానా విధించాలంటూ డిమాండ్

 

ట్రెండింగ్ వార్తలు