IPL 2024 : ధోనీ అద్భుత క్యాచ్.. ఒక్కసారిగా హోరెత్తిన స్టేడియం.. సురేశ్ రైనా ఏమన్నాడంటే?

ధోనీ అద్భుత క్యాచ్ పై టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో స్పందించాడు.

IPL 2024 : ధోనీ అద్భుత క్యాచ్.. ఒక్కసారిగా హోరెత్తిన స్టేడియం.. సురేశ్ రైనా ఏమన్నాడంటే?

MS Dhoni

MS Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ల వెనకాల ఉన్నాడంటే ఎంతటి అనుభవంఉన్న బ్యాటర్ అయినా ఒక కాలు క్రీజులో ఉంచి కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడతాడు. బ్యాటర్ క్రీజు వదిలి బయటకు వెళ్లాడంటే ధోనీ చేతిలోకి వెళ్లిన బాల్ అంతేవేగంతో వెనక్కువచ్చి వికెట్లను పడేస్తుంది. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగాయి. తాజాగా మంగళవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ధోనీ వికెట్ల వెనుకాల అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా ధోనీ నామస్మరణతో దద్దరిల్లిపోయింది.

Also Read : Rohit Sharma : ప్లయింగ్ కిస్‌తో మయాంక్ అగ‌ర్వాల్‌ను ఆట‌ప‌ట్టించిన రోహిత్ శ‌ర్మ‌.. వీడియో వైరల్

మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం రాత్రి మైదానంలో మాయాజాలాన్ని ప్రదర్శించాడు. విజయ్ శంకర్ ఇచ్చిన క్యాచ్ ను గాల్లోకి డ్రైవ్ చేసి ధోనీ అందుకున్నాడు. సీఎస్ కే జట్టు బౌలర్ డారిల్ మిథెల్ ఎనిమిదో ఓవర్ వేయగా.. క్రీజులో ఉన్న విజయ్ శంకర్ దానిని బౌండరీ తరలించే ప్రయత్నం చేశాడు.. ఆ బాల్ కాస్త బ్యాట్ ఎడ్జ్ కు తాకి ధోనీ కుడివైపుకు దూరంగా వెళ్లసాగింది. ధోనీ దాదాపు 2.2 మీటర్లు డ్రైవ్ చేసి రెండు చేతులతో అద్బుతమైన క్యాచ్ అందుకున్నాడు. ధోనీ వికెట్ల వెనక విన్యాసంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధోనీ పట్టిన క్యాచ్ నుచూసిన నెటిజన్లు ధోనీ వయస్సు 42నా? 24నా? అంటూ ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read : IPL 2024 -CSK vs GT : చెలరేగిన శివమ్ దూబే, రవీంద్ర.. గుజరాత్ చిత్తు.. వరుసగా రెండోసారి చెన్నై విజయం

ధోనీ అందుకున్న అద్భుతమైన క్యాచ్ ను చూసి మాజీ, తాజా క్రికెట్లు ఆశ్చర్యపోతున్నారు. టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో స్పందించారు. ధోనీ క్యాచ్ కు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి.. ధోనీ భాయ్ ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉంటూ.. చుట్టుపక్కల ఉన్న ప్రతిఒక్కరికి స్ఫూర్తినిస్తాడు అంటూ పేర్కొన్నాడు.

ఇదిలాఉంటే.. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరు వికెట్లు నష్టానికి 206 పరుగులు చేసింది. చెన్నై నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి కేవలం 143 పరుగులు మాత్రమే చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 63 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 

 

 

View this post on Instagram

 

A post shared by Suresh Raina (@sureshraina3)