పశ్చాత్తాపం: శ్రీశాంత్ ఎప్పటికీ నా సోదరుడేనంటోన్న భజ్జీ

టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్.. కేరళ స్పీడ్‌స్టర్‌ శ్రీశాంత్‌పై చేయి చేసుకున్న ఘటనపై ఇన్నాళ్లుగా కుమిలిపోతున్నాని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఒకవేళ తన జీవితంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే ఆ ఘటన జరగకుండా జాగ్రత్తపడతానని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భజ్జీ మాట్లాడుతూ.. నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు.

పశ్చాత్తాపం: శ్రీశాంత్ ఎప్పటికీ నా సోదరుడేనంటోన్న భజ్జీ

Updated On : January 22, 2019 / 8:14 AM IST

టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్.. కేరళ స్పీడ్‌స్టర్‌ శ్రీశాంత్‌పై చేయి చేసుకున్న ఘటనపై ఇన్నాళ్లుగా కుమిలిపోతున్నాని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఒకవేళ తన జీవితంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే ఆ ఘటన జరగకుండా జాగ్రత్తపడతానని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భజ్జీ మాట్లాడుతూ.. నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు.

టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్.. కేరళ స్పీడ్‌స్టర్‌ శ్రీశాంత్‌పై చేయి చేసుకున్న ఘటనపై ఇన్నాళ్లుగా కుమిలిపోతున్నాని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఒకవేళ తన జీవితంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే ఆ ఘటన జరగకుండా జాగ్రత్తపడతానని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భజ్జీ మాట్లాడుతూ.. నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు.  

11 ఏళ్ల క్రితం 2008 ఐపీఎల్‌లో జరిగిన ఈ ఘటన అప్పట్లో పెను సంచలనమైంది. ఐపీఎల్‌ మొదటి సీజన్‌లో భజ్జీ ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడాడు. కింగ్స్‌ ఎలెవన్‌కు శ్రీశాంత్‌ ప్రాతినిధ్యం వహించాడు. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో హఠాత్తుగా శ్రీ చెంపపై భజ్జీ కొట్టాడు. దాంతో భావోద్వేగానికి గురైన శ్రీశాంత్‌ కన్నీరు పెట్టుకున్నాడు. వెంటనే కింగ్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి భజ్జీ అతడిని క్షమాపణ కోరాడు. ఈ ఘటన అందరికీ షాక్‌ కలిగించిన సంగతి తెలిసిందే. శ్రీశాంత్ అద్భుత ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదన్న హర్భజన్.. తాను అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. 

‘శ్రీశాంత్‌తో మైదానంలో అప్పుడు జరిగిన ఘటన గురించి ఇంకా జనాలు మాట్లాడుకుంటారు. ఒక వేళ నా జీవితంలో వెనక్కి వెళ్లి మార్చుకొనే అవకాశం గనక వస్తే ఈ ఘటనను సరిదిద్దుకుంటాను. అలా చేసిండాల్సింది కాదు. నేను తప్పు చేశాను. శ్రీశాంత్‌ అద్భుత ఆటగాడు. అతడికి ఎంతో నైపుణ్యం ఉంది. శ్రీశాంత్‌కు, భార్యా పిల్లలకు తన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని పేర్కొన్నాడు. ఎవరేమనుకున్నా తాను పట్టించుకోబోనని, శ్రీశాంత్ ఇప్పటికీ తన సోదరుడేనని హర్భజన్ స్పష్టం చేశాడు.  

2008 ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్-ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. మ్యాచ్ జరుగుతుండగా కింగ్స్ ఎలెవెన్‌కు ప్రాతినిధ్యం వహించిన శ్రీశాంత్ ముంబై బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. అతిగా సంబరాలు చేసుకోవడం నచ్చని భజ్జీ.. శ్రీశాంత్‌ను చెంప మీద కొట్టాడు. దాంతో ఆ ఘటన అప్పుడు వైరల్‌గా మారి సంచలనమైంది.