Harbhajan Singh: ఆప్ అభ్యర్థిగా రాజ్యసభకు భజ్జీ
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ ఎన్నికలకు సిద్ధం కానున్నట్లు వెల్లడైంది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అభ్యర్థిగా భజ్జీని ఎంచుకున్నట్లు ప్రకటించింది. ఈ నెలాఖరుకల్లా ఐదు..

Harbhajan Singh
Harbhajan Singh: టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ ఎన్నికలకు సిద్ధం కానున్నట్లు వెల్లడైంది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అభ్యర్థిగా భజ్జీని ఎంచుకున్నట్లు ప్రకటించింది. ఈ నెలాఖరుకల్లా ఐదు సీట్లు టార్గెట్ గా ఆప్ ప్రయత్నాలు మొదలుపెట్టనుంది.
భగవంత్ మన్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ పంజాబ్ కొత్త ప్రభుత్వంలో హర్భజన్ సింగ్ కు స్పోర్ట్స్ యూనివర్సిటీ మీద పూర్తి కమాండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
పంజాబ్ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో హర్భజన్ సింగ్ బీజేపీలో జాయిన్ అయ్యాడంటూ వార్తలు వచ్చాయి. ఓ సీనియర్ లీడర్ సైతం హర్భజన ్సింగ్, యువరాజ్ సింగ్ తమ వైపే ఉన్నారంటూ చెప్పుకొచ్చారు కూడా. తర్వాత అవన్నీ రూమర్లేనంటూ కొట్టిపారేసిన భజ్జీ.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూతో కలిసి ఫొటో దిగారు.
Read Also: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన హర్భజన్‌సింగ్
పైగా దానికి ‘అవకాశాలతో లోడ్ అయి ఉన్నాయి. షైనింగ్ స్టార్ భజ్జీతో ఈ ఫొటో’ అని ట్విట్టర్ లో పోస్టు చేస్తూ క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు అధికారికంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన ఆ రూమర్లన్నింటినీ తుడిచిపెట్టేసింది.