Finch
International Tours: ఆస్ట్రేలియా తరపున జరగబోయే టీ20, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరం అయ్యారు. రాబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ఆస్ట్రేలియా అగ్రశ్రేణి ఆటగాళ్ళు టూరింగ్ స్క్వాడ్ నుంచి వైదొలగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు కెప్టెన్ ఆరోన్ ఫించ్. వాయిదాపడిన ఐపిఎల్ ద్వితీయార్ధంలో పాల్గొనడానికి వారు టూర్‌ల నుంచి వైదొలగడం సమర్థించదగిన విషయం కాదని అన్నారు ఆరోన్ ఫించ్.
దేశంలోని ఏడుగురు అగ్రశ్రేణి ఆటగాళ్ళు డేవిడ్ వార్నర్, పాట్ కమ్మిన్స్, గ్లెన్ మాక్స్వెల్, రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, మార్కస్ స్టోయినిస్ మరియు డేనియల్ సామ్స్ వెస్టిండీస్ మరియు బంగ్లాదేశ్ పర్యటనలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వార్నర్ మరియు కమ్మిన్స్ దీర్ఘకాలిక ప్రణాళికగా వెస్టిండీస్ మరియు బంగ్లాదేశ్ పర్యటించకూడదని నిర్ణయించుకున్నారు. అయితే, ఫించ్ తన జట్టు సభ్యుల నిర్ణయాన్ని అర్థం చేసుకోగలనని చెప్పాడు.
పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ ఫించ్ మాట్లాడుతూ, ‘నేను జట్టుకు దూరంగా ఉంటున్న వారందరితో మాట్లాడాను.. వారు ఇచ్చిన సమాధానానికి కొద్దిగా ఆశ్చర్యపోయాను, కానీ వారి పరిస్థితి అర్థమయ్యింది. వారు జట్టుతో ఉండాలని నేను కోరుకున్నాను. టీ20 ప్రపంచకప్ మరియు దేశీయ సీజన్ కోసం పనిభారం రాబోయే కాలంలో బాగా పెరుగుతుంది. కాబట్టి ఐపిఎల్ రెండవ భాగంలో ఆడడాన్ని నేను సమర్థించను. అని అన్నారు.