హార్దిక్ పాండ్యా మళ్లీ బ్రేకప్..? అప్పుడు నటాషాతో విడాకులు.. ఇప్పుడు..

టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, బ్రిటీష్ గాయ‌ని జాస్మిన్ వాలియా విడిపోయారా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది.

Hardik Pandya and Jasmin Walia breakup rumours

టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, బ్రిటీష్ గాయ‌ని జాస్మిన్ వాలియా విడిపోయారా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. వీరిద్ద‌రు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక‌రినొక‌రు అన్‌ఫాలో చేసుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రు త‌మ ప్రేమ‌కు గుడ్ బై చెప్పేశార‌నే పుకార్లు వినిపిస్తున్నాయి.

హార్దిక్ పాండ్యా త‌న భార్య నటాషా స్టాంకోవిచ్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత బ్రిటీష్ సింగ‌ర్‌, టీవీ ప‌ర్స‌నాల్టీ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. దీనిపై అటు జాస్మిన్ కానీ ఇటు హార్దిక్ గానీ ఎన్న‌డూ స్పందించ‌లేదు. కానీ.. టీమ్ఇండియా ఆడే మ్యాచ్‌ల‌తో పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ ఆడిన మ్యాచ్‌ల సంద‌ర్భంగా స్టేడియంలో జాస్మిన్ క‌నిపించేది. హార్దిక్ కెప్టెన్‌గా ఉన్న ముంబై టీమ్ బ‌స్సులోనూ ఆమె ప్ర‌యాణించిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

WCL 2025 : క‌మ్రాన్ అక్మ‌ల్ ఏం మార‌లేదు.. ఎనిమిదేళ్లు అయినా కూడా మిస్ చేస్తూనే..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు నాయ‌క‌త్వం వ‌హించిన హార్దిక్ పాండ్యా ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. త‌రుచూ గాయాల బారిన ప‌డ‌డంతో టెస్టులు ఆడ‌న‌ని, ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ మాత్ర‌మే ఆడ‌తాన‌ని ఇప్ప‌టికే హార్దిక్ బీసీసీఐకి స్ప‌ష్టం చేశాడు. ఇందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అందుక‌నే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌తో హార్దిక్ ఆడ‌డం లేదు.

బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డ‌డంతో అక్టోబ‌ర్‌లోనే భార‌త జ‌ట్టు ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ ఆడ‌నుంది. దీంతో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న వ‌ర‌కు హార్దిక్ కు సుదీర్ఘ విరామం దొరికిన‌ట్లైంది.