WCL 2025 : కమ్రాన్ అక్మల్ ఏం మారలేదు.. ఎనిమిదేళ్లు అయినా కూడా మిస్ చేస్తూనే..
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు అందరూ కలిసి వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) లీగ్ ఆడుతున్నారు

WCL 2025 Kamran Akmal fumbles behind stumps yet again
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు అందరూ కలిసి వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) లీగ్ ఆడుతున్నారు. శుక్రవారం నుంచి ఇంగ్లాండ్ వేదికగా డబ్ల్యూసీఎల్ (WCL 2025) రెండో సీజన్ ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్‌తో పాకిస్థాన్ ఛాంపియన్స్ (ENG vs PAK) తలపడింది.
ఈ మ్యాచ్‌లో మహ్మద్ హఫీజ్ నేతృత్వంలో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు సాధించింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ హఫీజ్ (54; 34 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. కమ్రాన్ అక్మల్ (8), షార్జీల్ ఖాన్ (12), షోయబ్ మాలిక్ (1), ఉమర్ అమీన్ (6) లు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లో లియామ్ ప్లంకెట్, క్రిస్ ట్రెమ్లెట్ చెరో రెండు వికెట్లు తీశారు. విన్స్, మాస్కరన్హస్, ఆర్జే సైడ్‌బాటమ్, స్టువర్ట్ మీకర్ తలా ఓ వికెట్ సాధించారు.
ENG vs IND : భారత్‌తో నాలుగో టెస్టు.. రూట్ గనుక 31 పరుగులు చేస్తే..
అనంతరం ఫిల్ మస్టర్డ్ (58; 51 బంతుల్లో 8 ఫోర్లు), ఇయాన్ బెల్ (51 నాటౌట్; 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగినా లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. దీంతో పాక్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. పాక్ బౌలర్లలో ఆమిర్ యమిన్, రాయిస్, సొహైల్ తన్వీర్ తలా ఓ వికెట్ తీశారు.
కమ్రాన్ మిస్..
ఈ మ్యాచ్‌లో పాక్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఓ ఈజీ స్టంపౌట్‌ను మిస్ చేశాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌ను షోయబ్ మాలిక్ వేశాడు. ఈ ఓవర్‌లోని తొలి బంతిని భారీ షాట్ ఆడేందుకు ఫిల్ మస్టర్డ్ క్రీజు దాటి చాలా ముందుకు వచ్చాడు. బంతి అతడి బ్యాట్‌ను తాకకుండా వికెట్ కీపర్ దిశగా వచ్చింది. అయితే.. బాల్‌ను ఒడిసిపట్టి స్టంపౌట్ చేయడంలో అక్మల్ ఘోరంగా విపలం అయ్యాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మస్టర్డ్ హాఫ్ సెంచరీ చేశాడు.
ENG vs IND : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు.. భారత్‌కు తలనొప్పిగా మారిన తుది జట్టు కూర్పు..!
Kamran Akmal doing what he does best! #PakistanCricket
— Usman (@jamilmusman_) July 18, 2025
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అక్మల్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రిటైర్ అయి ఎనిమిదేళ్లు అయినా కూడా ఏం మారలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.