ENG vs IND : భారత్‌తో నాలుగో టెస్టు.. రూట్ గనుక 31 పరుగులు చేస్తే..
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

ENG vs IND 4th test Joe Root needs 31 runs to break Kallis and Dravid historic Test feat
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 23 నుంచి 27 వరకు మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గనుక రూట్ 31 పరుగులు చేస్తే.. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు. ఈ క్రమంలో అతడు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు జాక్వెస్ కలిస్, భారత దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్‌లను అధిగమిస్తాడు.
జోరూట్ ఇప్పటి వరకు 156 టెస్టులు ఆడాడు. 50.80 సగటుతో 13259 పరుగులు చేశాడు. ఇందులో 37 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ద్రవిడ్ 164 మ్యాచ్‌ల్లో 52.31 సగటుతో 13288 పరుగులు చేశాడు. జాక్వెస్ కలిస్ 166 మ్యాచ్‌ల్లో 55.37 సగటుతో 13289 పరుగులు చేశాడు.
ENG vs IND : మాంచెస్టర్‌లో టీమ్ఇండియా రికార్డు చూస్తే మైండ్ బ్లాక్..
ఇక టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 200 టెస్టుల్లో 53.78 సగటుతో 15,921 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత 13378 పరుగులతో రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు.
టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచేందుకు రూట్‌కు కేవలం 120 పరుగులే అవసరం. నాలుగో టెస్టులో గానీ, ఐదో టెస్టు మ్యాచ్‌లోగానీ రూట్ ఈ ఘనతను సాధించొచ్చు.
ENG vs IND : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు.. భారత్‌కు తలనొప్పిగా మారిన తుది జట్టు కూర్పు..!
టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
సచిన్ టెండూల్కర్ (భారత్) – 200 మ్యాచ్‌ల్లో 15,921 పరుగులు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 168 మ్యాచ్‌ల్లో 13,378 పరుగులు
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 166 మ్యాచ్‌ల్లో 13,289 పరుగులు
రాహుల్ ద్రవిడ్ (భారత్) – 164 మ్యాచ్‌ల్లో 13,288 పరుగులు
జోరూట్ (ఇంగ్లాండ్) – 156 మ్యాచ్‌ల్లో 13,259 పరుగులు
భారత్, ఇంగ్లాండ్ సిరీస్ విషయానికి వస్తే.. మూడు మ్యాచ్‌లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలని ఆరాటపడుతోంది. మరోవైపు భారత్ ఎలాగైన ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది.