MI vs KKR : ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో తొలి విజ‌యం.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏమ‌న్నాడో తెలుసా?

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ముంబై తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ క్ర‌మంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

Courtesy BCCI

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ గెలుపు బోణి కొట్టింది. వాంఖ‌డే వేదిక‌గా సోమ‌వారం డిఫెండింగ్ ఛాంపియ‌న్స్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. స‌మిష్టిగా రాణించ‌డంతో విజ‌యం సాధించామ‌ని, ఈ క్ర‌మంలో జ‌ట్టు విజ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు కీల‌క పాత్ర పోషించార‌ని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా మొద‌ట బ్యాటింగ్ చేసింది. 16.2 ఓవ‌ర్ల‌లో 116 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో అంగ్క్రిష్ రఘువంశీ (26), ర‌మ‌ణ్‌దీప్ సింగ్ (22) లు రాణించారు. ముంబై బౌల‌ర్ల‌లో అశ్వని కుమార్ నాలుగు వికెట్లు తీశాడు. దీప‌క్ చాహ‌ర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విష్నేష్ పుతూర్‌, మిచెల్ సాంట్న‌ర్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

IPL 2025: అరంగేట్రం మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన యంగ్ బౌలర్.. ఎవరీ అశ్విని కుమార్.. వేలంలో ఎంత ధర పలికాడంటే?

అనంత‌రం ర్యాన్ రికెల్టన్ (62 నాటౌట్; 41 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) మెరుపు హాఫ్ సెంచ‌రీ బాద‌గా, సూర్య‌కుమార్ యాద‌వ్ (27 నాటౌట్; 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో ల‌క్ష్యాన్ని ముంబై 12.5 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది.

ఈ గెలుపు పై మ్యాచ్ అనంత‌రం హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. అశ్వ‌నికుమార్ ను మెచ్చుకున్నాడు. ఇక హోం గ్రౌండ్‌లో విజ‌యం సాధించ‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని చెప్పాడు. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌న‌తోనే ఈ విజ‌యం సాధించామ‌ని, జ‌ట్టు విజ‌యానికి సహ‌క‌రించిన అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు.

Riyan Parag : కెప్టెన్‌గా తొలి విజ‌యం.. రియాన్ ప‌రాగ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ..

అశ్విని కుమార్ బౌలింగ్ చేసిన విధానం అద్భుతం అని అన్నాడు. ఇందుకు MI స్కౌట్స్ కు ధ‌న్య‌వాదాలు చెప్పాడు. MI స్కౌట్స్ అన్ని చోట్ల‌కు వెళ్లి ఇలాంటి ట్యాలెంట్ ఉన్న ఆట‌గాళ్ల‌ను తీసుకువ‌స్తున్నార‌న్నాడు.

‘మేము ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాము. అందులో అశ్వనికుమార్ బౌలింగ్‌ను గ‌మ‌నించాను. అత‌డి బంతిని లేట్‌గా స్వింగ్ చేస్తున్నాడు. భిన్న‌మైన యాక్ష‌న్ క‌లిగి ఉండ‌డంతో పాటు అత‌డు ఎడ‌మ చేతి వాటం పేస‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో అత‌డికి అవ‌కాశం ఇవ్వాల‌ని భావించాము. ఆండ్రీ ర‌స్సెన్ వికెట్ ఎంతో కీల‌కం. అత‌డిని క్లీన్ బౌల్డ్ చేసిన విధానం బాగుంది. బౌలింగ్ కంటే ముందుగానే అశ్వ‌ని ఫీల్డింగ్‌లో అద‌ర‌గొట్టాడు. క్వింట‌న్ డికాక్ క్యాచ్ అద్భుత రీతిలో అందుకున్నాడు. ఓ ఫాస్ట్ బౌల‌ర్ అంత ఎత్తుకు ఎగురుతూ అందుకోవ‌డం బాగుంది. ఏదీ ఏమైన‌ప్ప‌టికి అది టీమ్ విజ‌యం.’ అని పాండ్యా అన్నాడు.