Hardik Pandya Creates History Becomes First Indian To Achieve massive feat
Hardik Pandya : టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అరుదైన ఘనత సాధించాడు. పాక్‌తో టీ20 మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆసియాకప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి బంతికే వికెట్ తీయడం ద్వారా అతడు ఈ ఘనత అందుకున్నాడు.
టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలింగ్ ఎటాక్‌ను హార్దిక్ (Hardik Pandya) ఆరంభించాడు. తొలి బంతిని వైడ్‌గా వేశాడు. ఆ తరువాత వెంటనే వికెట్ పడగొట్టాడు. హార్దిక్ ఔట్ స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన పాక్ ఓపెనర్ సయూబ్ ఆయుబ్ షాట్ ఆడగా బుమ్రా చక్కని క్యాచ్ అందుకున్నాడు.
ఇక భారత్ తరుపున టీ20ల్లో తొలి బంతికే వికెట్ తీసిన జాబితాలో హార్దిక్ రెండో బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ తొలి బంతికే వికెట్ తీశాడు.
పాక్ పై మూడో బౌలర్‌గా..
ఇక పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మొదటి బంతికే వికెట్ తీసిన మూడో బౌలర్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. శ్రీలంకకు చెందిన నువాన్ కులశేఖర 2009లో ఈ ఘనత సాధించగా, దక్షిణాఫ్రికాకు చెందిన జార్ఝ్ లిండే 2021లో రెండో బౌలర్‌గా నిలిచాడు.
Aapka Mother of all Rivalries mein 𝘏𝘈𝘙𝘋𝘐𝘒 swaagat 😉
Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/AEQE0TLQju
— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ (40; 44 బంతుల్లో 1ఫోర్, 3 సిక్సర్లు), టెయిలెండర్ షహీన్ షా అఫ్రిది (33 నాటౌట్; 16 బంతుల్లో 4 సిక్సర్లు) రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్; 37 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ (31; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (31; 31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. పాక్ బౌలర్లలో సయిమ్ అయూబ్ మూడు వికెట్లు తీశాడు.