Michael Clarke : హార్దిక్ పై ఎడ‌తెగ‌ని హేళ‌న‌ను ఆపేందుకు ఏకైక మార్గం అదే : మైకేల్ క్లార్క్‌

ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ పాండ్య కెప్టెన్సీ బాధ్య‌త‌లు అందుకున్న‌ప్ప‌టి నుంచి కొంత మంది అత‌డిని ట్రోల్ చేస్తున్నారు.

Hardik Pandya Finally Asked Directly On Fan Boos Michael Clarke Reveals Response

Michael Clarke-Hardik Pandya : ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ పాండ్య కెప్టెన్సీ బాధ్య‌త‌లు అందుకున్న‌ప్ప‌టి నుంచి కొంత మంది అత‌డిని ట్రోల్ చేస్తున్నారు. రోహిత్ శ‌ర్మ నుంచి నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అందుకున్న విధానం పై సొంత జ‌ట్టు అభిమానుల నుంచే హార్దిక్ కు నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. అదే స‌మ‌యంలో మూడు మ్యాచుల్లో ముంబై ఓడిపోవ‌డం కూడా హార్దిక్ క‌ష్టాల‌ను రెట్టింపు చేశాయి.

మైదానంలోనే కాదు అత‌డు ఎక్క‌డ క‌నిపించినా స‌రే అభిమానుల నుంచి ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నాడు. ఈ స‌మ‌యంలో ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు హార్దిక్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ కార్క్ త‌న మ‌ద్ద‌తును తెలియ‌జేశాడు. హార్దిక్‌తో తాను మాట్లాడిన‌ట్లు వెల్ల‌డించాడు. హార్దిక్ ఆత్మ‌విశ్వాసంతో ఉన్న‌ట్లు వెల్ల‌డించాడు. ముంబై వ‌రుస విజ‌యాలు సాధిస్తే అత‌డు ఫ్యాన్స్ హృద‌యాల‌ను గెలుచుకుంటాడ‌ని కార్క్ అన్నాడు.

IPL 2024: క్రికెట్ పిచ్చికి నిద‌ర్శ‌నం.. దిండు, దుప్ప‌టితో దిగేశారుగా..

“మీ జట్టు ప్రదర్శన స‌రిగా లేనప్పుడు ఇది సహాయం చేయదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు హార్దిక్ పాండ్యాతో మాట్లాడాను. అతను బాగానే ఉన్నాడని అనిపించింది. అతను ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి. ఈ జట్టును గెలిపించాల్సిన అవసరం ఉంది. ముంబై చాలా మంచి జట్టు. ఈ జ‌ట్టు పై ఎల్లప్పుడూ అధిక అంచనాలు ఉంటాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో ఎల్ల‌ప్పుడూ ముంబై అగ్ర‌స్థానంలో ఉండాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటారు. అయితే.. ప్ర‌స్తుతం అట్ట‌డుగు స్థానంలో ఉన్నారు.” అని కార్క్ అన్నాడు.

పాండ్యా మ్యాచ్‌లను గెలవడం ప్రారంభించాలని సూచించిన క్లార్క్ అలా చేసిన‌ట్ల‌యితే.. అత‌డి పై వ‌చ్చే విమ‌ర్శ‌లు, అభిమానుల ఎగ‌తాలి వంటి విష‌యాలు ఆగిపోతాయ‌న్నాడు.

ఇంగ్లాండ్‌ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న పతనం గురించి మాట్లాడాడు. ఎడ‌తెగ‌ని హేళ‌న‌ను ఆప‌డానికి ఉన్న ఏకైక మార్గం మ్యాచ్‌ల‌ను గెల‌వ‌డం ద్వారా మాత్ర‌మే అని అభిప్రాయ‌ప‌డ్డాడు.

Rohit Sharma : మెగావేలంలోకి రానున్న రోహిత్ శ‌ర్మ‌? ముంబైని వీడ‌నున్నాడా?

ట్రెండింగ్ వార్తలు