IPL 2025: పాండ్యా ఔట్.. ముంబై పగ్గాలు మళ్లీ రోహిత్ కి.. ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ లో..

మార్చి 23న సాయంత్రం చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు హార్ధిక్ పాండ్యా ...

Rohit sharma and Hardik Pandya

IPL 2025: భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ సందడి షురూ కానుండగా.. మే 25న ఫైనల్ పోరు జరగనుంది. ఈ సీజన్ లో 65 రోజుల పాటు 74 మ్యాచ్ లు 13 వేదికల్లో జరగనున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటని చెప్పొచ్చు. ఐపీఎల్ -2025 సీజన్ లో ముంబై జట్టు తన తొలి మ్యాచ్ ను మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ లో ముంబై జట్టు తరపున హార్దిక్ పాండ్యా ఆడే అవకాశాన్ని కోల్పోయాడు.

Also Read: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ వేళ ఆ ఇద్దరు ప్లేయర్ల విషయంలో గంభీర్, అగార్కర్ మధ్య వాగ్యుద్దం.. రోహిత్ ఎవరి వైపు అంటే?

ఐపీఎల్-2024 సీజన్ లో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు చెత్తప్రదర్శనతో ఫ్యాన్స్ నుంచి విమర్శలను ఎదుర్కొంది. ఆ సీజన్లో మే17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబై జట్టు తలపడింది. ఆ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానాను ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ యాజమాన్యం అప్పటికే కెప్టెన్ పాండ్యాపై రెండు సార్లు జరిమానా విధించింది. దీంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం..  పాండ్యాకు రూ. 30లక్షల జరిమానాతోపాటు ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అప్పటికే టోర్నీలో ముంబై ఆడే మ్యాచ్ లన్నీ పూర్తికావడంతో ఆ ప్రభావం ఐపీఎల్ -2025 సీజన్లో తొలి మ్యాచ్ పై పడింది. దీంతో హార్దిక్ పాండ్యా ఈ సీజన్ లో చెన్నై జట్టుతో తలపడే మొదటి మ్యాచ్ లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు.

Also Read: IPL 2025: హైదరాబాద్‌లో IPL మ్యాచ్‌ల డేట్స్ ఇవే.. మొత్తం 9.. ఇక విశాఖలో మాత్రం జస్ట్..

23న సాయంత్రం చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు హార్ధిక్ పాండ్యా స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే, సూర్యకుమార్ యాదవ్, జస్ర్పీత్ బుమ్రా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై యాజమాన్యం ఆ ముగ్గురిలో ఎవరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.