Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ వేళ ఆ ఇద్దరు ప్లేయర్ల విషయంలో గంభీర్, అగార్కర్ మధ్య వాగ్యుద్దం.. రోహిత్ ఎవరి వైపు అంటే?

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీకోసం ఇప్పటికే దుబాయ్ లో అడుగు పెట్టింది. ఆటగాళ్లు ప్రాక్టీస్ సైతం చేస్తున్నారు. ఈనెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు అవుతుంది.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ వేళ ఆ ఇద్దరు ప్లేయర్ల విషయంలో గంభీర్, అగార్కర్ మధ్య వాగ్యుద్దం.. రోహిత్ ఎవరి వైపు అంటే?

Rohit Sharma Gautam Gambhir Ajit Agarkar

Updated On : February 17, 2025 / 7:12 AM IST

Champions Trophy: భారత జట్టు ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ లో బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. శ్రేయాస్ అయ్యర్ నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేసి రెండు అర్ధ సెంచరీలతో సహా 181 పరుగులు చేశాడు. వాస్తవానికి ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో తుది జట్టులో చేరే అవకాశం శ్రేయాస్ కు ఉంటుందని ఎవరూ అనుకోలేదు. కానీ, విరాట్ కోహ్లీ గాయం కారణంగా అతనికి తొలి వన్డేలో అవకాశం దక్కింది. ఆ మ్యాచ్ లో ఆఫ్ సెంచరీతో శ్రేయాస్ రాణించడంతో మిగిలిన రెండు మ్యాచ్ లోనూ అతను తుది జట్టులో కొనసాగాడు.

Also Read: IPL 2025: హైదరాబాద్‌లో IPL మ్యాచ్‌ల డేట్స్ ఇవే.. మొత్తం 9.. ఇక విశాఖలో మాత్రం జస్ట్..

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీకోసం ఇప్పటికే దుబాయ్ లో అడుగు పెట్టింది. ఆటగాళ్లు ప్రాక్టీస్ సైతం చేస్తున్నారు. ఈనెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు అవుతుంది. భారత జట్టు ఈనెల 20న బంగ్లాదేశ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం జట్టులో 11 మంది సభ్యుల ఎంపిక విషయంలో గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య ఏకాభిప్రాయం లేదని, వారిద్దరి మధ్య కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ విషయంలో తీవ్రస్థాయిలో వాగ్యుద్దం జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే, ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన మూడు వన్డేల్లోనూ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా మైదానంలోకి వచ్చాడు. దీంతో పంత్ కు మూడు మ్యాచ్ లలో అవకాశం దక్కలేదు.

Also Read: IPL 2025 Schedule: ఐపీఎల్‌ 2025 షెడ్యూల్‌ వచ్చేసింది.. మార్చి 22 నుంచి షురూ.. పూర్తి షెడ్యూల్‌ ఇదిగో

జట్టులో వికెట్ కీపర్ స్థానం రిషబ్ పంత్ దే అని, అతణ్నే తుది జట్టులో ఆడించాలని అగార్కర్ అభిప్రాయపడగా.. ఛాంపియన్స్ ట్రోపీకి ముందు జరిగిన సమావేశంలో ప్రధాన కోచ్ గంభీర్ మాత్రం వికెట్ కీపర్ విషయంలో తమ తొలి ప్రాధాన్యత కేఎల్ రాహులేనని చెప్పాడు. పంత్ కు అవకాశాలు వస్తాయి. కానీ, ప్రస్తుతం రాహుల్ బాగా రాణిస్తున్నాడు. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లను ఆడించడం వీలుకాదు అని గంభీర్ చెప్పాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగే మ్యాచ్ లలోనూ రిషబ్ పంత్ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.

Also Read: Champions Trophy: కోహ్లీ, రోహిత్, జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్ అవుతారు.. ఎందుకో చెప్పిన ఆకాశ్‌ చోప్రా

గత నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు కోసం జరిగిన విలేకరుల సమావేశంలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్, ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. వన్డే జట్టులో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ మొదటి ఎంపిక అని అన్నారు. కానీ, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్ తో జరిగే వన్డే జట్టులో కేఎల్ రాహుల్ కు ఆడే అవకాశం ఇచ్చారు. తద్వారా రోహిత్ శర్మ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాన్నే ఆమోదించాడు.

 

శ్రేయాస్ విషయంలోనూ గంభీర్, అగార్కర్ మధ్య వాగ్యుద్దం జరిగినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి శ్రేయాస్ ను ఎంపిక చేసే విషయంలో అగార్కర్ వ్యతిరేకించారని, గంభీర్ మాత్రం అతన్ని పట్టుబట్టి ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో ఆడించడంతో పాటు.. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక చేయించినట్లు సమాచారం. మొత్తానికి ప్లేయర్ల ఎంపిక విషయంలో గంభీర్ వర్సెస్ అగార్కర్ అన్నట్లుగా వాగ్యుద్దం జరుగుతుండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం గంభీర్ నిర్ణయాలకే ఒకే చెబుతున్నాడన్న చర్చ క్రికెట్ వర్గాల్లో జరుగుతుంది.