IPL 2025: హైదరాబాద్‌లో IPL మ్యాచ్‌ల డేట్స్ ఇవే.. మొత్తం 9.. ఇక విశాఖలో మాత్రం జస్ట్..

క్వాలిఫయర్-1.. మే 20న జరగనుండగా, ఎలిమినేటర్ మ్యాచ్ మే 21న జరగనుంది. ఈ రెండు మ్యాచులు హైదరాబాద్‌లోనే.

IPL 2025: హైదరాబాద్‌లో IPL మ్యాచ్‌ల డేట్స్ ఇవే.. మొత్తం 9.. ఇక విశాఖలో మాత్రం జస్ట్..

Rajiv Gandhi International Cricket Stadium uppal

Updated On : February 16, 2025 / 6:56 PM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 18వ ఎడిషన్‌ వచ్చే నెల 22 నుంచి ప్రారంభం కానుంది. 65 రోజుల పాటు జరిగే మ్యాచుల షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఏయే నగరాల్లో ఏయే మ్యాచులు జరుగుతాయన్న వివరాలు తెలిశాయి.

ఐపీఎల్‌ 2025 షెడ్యూల్‌ను ప్రకటించడంతో తెలంగాణలోని ఉప్పల్‌, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో జరిగే మ్యాచులపై కూడా స్పష్టత వచ్చింది. ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనుండగా వాటిలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9 మ్యాచులు జరగనున్నాయి. విశాఖపట్నంలో రెండు మ్యాచులు మాత్రమే జరగనున్నాయి.

Also Read: ఐపీఎల్‌ 2025 షెడ్యూల్‌ వచ్చేసింది.. మార్చి 22 నుంచి షురూ.. పూర్తి షెడ్యూల్‌ ఇదిగో

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు మార్చి 23న ఆర్‌ఆర్‌తో, మార్చి 27న ఎల్‌ఎస్‌జీతో, ఏప్రిల్ 6న జీటీతో, ఏప్రిల్ 12న పీబీకేఎస్‌తో, ఏప్రిల్ 23న ముంబైతో, మే 5న ఢిల్లీతో, మే 10న కేకేఆర్‌తో మ్యాచులు ఆడనుంది. మరో రెండు మ్యాచుల్లో క్వాలిఫయర్ ఒకటి, ఎలిమినేటర్‌ ఒకటి జరగనుంది.

క్వాలిఫయర్-1.. మే 20న జరగనుండగా, ఎలిమినేటర్ మ్యాచ్ మే 21న జరగనుంది. ఈ రెండు మ్యాచులు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుండడంతో నగరవాసులు ఖుషీ అవుతున్నారు.

దేశంలో కొత్త వేదికల్లోనూ ఐపీఎల్‌ మ్యాచులు జరగనున్నాయి. హైదరాబాద్‌, వైజాగ్‌తో పాటు అహ్మదాబాద్‌, బెంగళూరు, లక్నో, ముల్లన్‌పూర్‌, ఢిల్లీ, జైపూర్‌, ముంబయి, చెన్నై, గువాహటి, ధర్మశాల, కోల్‌కతాలో మ్యాచులు ఉంటాయి. ఆర్‌ఆర్‌ జట్టు గువాహటిని రెండో హోంగ్రౌండ్‌గా ఎంపిక చేసుకుంది.