Hardik Pandya return date confirmed before SA ODIs
Hardik Pandya : ఆసియాకప్ 2025లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ఆ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లతో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరం అయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి పాండ్యా (Hardik Pandya) కోలుకున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అతడు ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.
నవంబర్ 30 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తోనే పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని అంటున్నారు. కాగా.. అంతకముందే అతడు మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని అతడు దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొననున్నాడు. ఈ టోర్నీలో అతడు తన హోమ్ టీమ్ బరోడా తరుపున బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బరోడా జట్టు నవంబర్ 26న బెంగాల్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తోనే హార్దిక్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా.. ఈ టోర్నీలో హార్దిక్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉంది.
ఎందుకంటే దక్షిణాఫ్రికాతో నవంబర్ 30 నుంచి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం కానుండడమే అందుకు కారణం. ఈ సిరీస్‌కు హార్దిక్ ఎంపిక అయ్యే అవకాలు ఉన్నాయి. తొలి వన్డే మ్యాచ్ రాంచీ వేదికగా జరగనుంది.
Ravindra Jadeja : కెప్టెన్సీ ఇస్తేనే వస్తా.. రాజస్థాన్ రాయల్స్‌కు రవీంద్ర జడేజా కండీషన్..!
హార్దిక్ జట్టులో చేరితో మిడిలార్డర్ బలోపేతం అవుతోంది. అదే విధంగా పేస్ బౌలర్‌గానూ అతడిని ఉపయోగించుకోవచ్చు.