ధోనీ మళ్లీ దూరమే: హార్దిక్‌తో సఫారీలపై పోరుకు టీమిండియా

మరో పర్యటనకు మహేంద్ర సింగ్ ధోనీ లేకుండానే భారత్ పర్యటించనుంది. ఆర్మీ క్యాంపులో ట్రైనింగ్ తీసుకుంటానంటూ టీమిండియాకు దూరమయ్యాడు. ఈ గ్యాప్‌లో కోహ్లీ సేన వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. విండీస్ తర్వాత సఫారీలపై తలపడేందుకు దక్షిణాఫ్రికా వెళ్లనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. 

గురువారం దక్షిణాఫ్రికాతో 3టీ20లు తలపడనున్న జట్టు ఇదేనంటూ ప్రకటించిన జట్టులో 15మంది పేర్లను ప్రకటించింది. సెప్టెంబరు 15, 18, 22 తేదీల్లో జరిగే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది పేర్లను ప్రకటించింది. 

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో చోటు దక్కించుకున్నాడు. భవిష్యత్తు ప్రణాళికలు దృష్టిలో ఉంచుకుని మహేంద్ర సింగ్ ధోనీని దూరం పెట్టారు. యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌కు ఎక్కువ అవకాశాలు కల్పిస్తే కీపర్‌గా మెరుగవడానికి ఉపయోగపడుతుందని సెలక్టర్లు భావిస్తున్నారు. 

ఫాస్ట్‌ బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌కు టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. యువ ఆటగాళ్లైన ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైని జట్టులో పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు వహించనున్నారు. 

టీమిండియా 15మంది జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), హర్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్ చాహర్‌, నవదీప్‌ సైని.