ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ భారత్ ఓటమిపై టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది. ఆటలో గెలుపోటములు సహజమని భవిష్యత్తులో తమ జట్టు అద్భుతంగా ఆడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. లీగ్ దశలోని మ్యాచ్‌లన్ని గొప్పగా ఆడామని తెలిపింది. భారత్ జట్టుపై తనకు నమ్మకం ఉందని…. తిరిగి సత్తా చాటుతామన్నారు. కొన్నిసార్లు విజయం సాధిస్తే మరికొన్ని సార్లు ఓటమి చవిచూడాల్సి వస్తుందని అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామన్నారు.
మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలై భారత్ రన్నరప్‌గా నిలిచింది. మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టును ఫైనల్‌కు చేర్చిన టీమ్ ఇండియా ఓపెనర్ షెఫాలీ వర్మ ఓటమి అనంతరం కన్నీటి పర్యంతమైంది. కీలక సమరంలో రాణించలేకపోయాననే బాధ, అలిస్సా హీలీ క్యాచ్‌ను జార విడిచాననే వేదన కలిచివేసింది. దీంతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో, ఫైనల్ ముగిసిన అనంతరం తీవ్రంగా బాధపడింది. దీనికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. అయితే నెటిజన్లు మాత్రం ఆమెకి అండగా నిలుస్తున్నారు. నువ్వు అసలైన ఛాంపియన్, భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలను జట్టుకు అందిస్తావు అని కామెంట్లు చేస్తున్నారు.
See Also | నేను స్వాతంత్ర్య పోరాటయోధుడినే : ఇవిగో ప్రూఫ్స్ అంటున్నా 102 ఏళ్ల భారతీయుడు!!
షెఫాలీ వర్మపై హర్మన్ ప్రీత్ స్పందించింది. ఆస్ట్రేలియా ఓపెనర్ ఇచ్చిన హీలీ ఇచ్చిన క్యాచ్‌ను షెఫాలీ వర్మ అందుకోలేకపోయిందని అంతమాత్రాన ఆమెను నిందించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇతరులు కూడా క్యాచ్‌లు జారవిడిచారని చెప్పింది. షెఫాలీకి ఇంకా 16 సంవత్సరాలేనని.. అందులోనూ ఆమెకి ఇది తొలి ప్రపంచకప్ అని వివరించింది. షెఫాలీ ఆమె జట్టు కోసం ఎంతో గొప్పగా పోరాడిందని గుర్తు చేసింది.
* షఫాలీ..ఆట లేకుండా..టీమిండియా తుది పోరు వరకు చేరేదా అనే అభిప్రాయాలు వినిపించాయి.
* ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి షఫాలీ 163 పరుగులు చేస్తే..జట్టులో టాప్ – 3 బ్యాటర్లు స్మృతి, హర్మన్ కౌర్, జెమీమీలు కలిసి 14 ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులు 164 మాత్రమే.
* మిథాలీ రాజ్‌ను అసాధారణ పరిస్థితుల్లో పక్కకు నెట్టేసిన తర్వాత వీరిద్దరే కీలకంగా మారారు.
* కానీ..ఐదు ఇన్నింగ్స్‌లలో నాలుగు సార్లు సింగిల్ డిజిట్‌కు పరిమితమైన హర్మన్‌కు పుట్టిన రోజు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
* స్మృతి ఒక్క మ్యాచ్‌లోనూ 20 దాటలేకపోయింది.
Read More :మారుతీరావు అంత్యక్రియలు : అమృత వస్తుందా..పోలీసుల భారీ బందోబస్తు