Harry Brook's bizarre Smog Reasoning behind England's loss
తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓడిపోవడానికి కారణం ఏంటి అనేది ఆ జట్టు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ రెండో టీ20కి ముందు వెల్లడించాడు. స్పిన్ బౌలింగ్‌ను ఆడలేక ఇంగ్లాండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే.. బ్రూక్ మాత్రం పొగమంచు కారణాంగానే తాము స్పిన్ బౌలింగ్‌లో సరిగ్గా ఆడలేకపోయామని చెప్పాడు. కోల్‌కతాలో విపరీతమైన పొగమంచు ఉందని, దీంతో తాము బంతిని సరిగ్గా చూడలేకపోయామని ఆరోపించాడు. రెండో టీ20 మ్యాచ్‌కు వేదికైన చెన్నైలో పరిస్థితి మెరుగ్గానే ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. సరిగ్గా 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ హాఫ్ సెంచరీతో రాణించగా మరో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రెండు అంకెల స్కోరు అందుకున్నారు. వీరిలో హ్యారీ బ్రూక్ ఒకడు. 14 బంతులు ఎదుర్కొన్న బ్రూక్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
ఓ దశలో ఇంగ్లాండ్ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులతో పటిష్ట స్థితిలోనే ఉంది. అయితే.. స్పిన్నర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 109 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
IND vs ENG 2nd T20 : హిస్టరీకి అడుగు దూరంలో అర్ష్ దీప్.. ఇవాళ కొట్టేస్తాడా!
133 పరుగుల లక్ష్యాన్ని సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ఇండియా 12.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అభిషేక్ శర్మ 34 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్లతో 79 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
పొగమంచే కారణం..
చెన్నైలో రెండో టీ20 మ్యాచ్‌కు ముందు హ్యారీ బ్రూక్ మీడియాతో మాట్లాడాడు. కోల్‌కతాలో పొగమంచు కారణంగా స్పిన్నర్ల బంతిని ఎదుర్కొనడం కష్టమైందన్నాడు. నేను బిష్ణోయ్ బౌలింగ్‌ను ఆడలేదు. కానీ వరుణ్ చక్రవర్తి చాలా మంచి బౌలర్. నిజానికి పొగమంచు ఎక్కువగా ఉండడంతో వరుణ్ బంతిని రీడ్ చేయడం కాస్త కష్టమైంది. చెన్నైలో అలాంటి వాతావరణం ఉండదని అనుకుంటున్నాను. ఇక్కడ బంతి స్పష్టంగా కనిపిస్తుందని భావిస్తున్నాను అని హ్యారీ బ్రూక్ అన్నాడు.
స్పిన్ అస్త్రాన్ని భారత్ మాపై ప్రయోగించాలని అనుకుంటోంది. రెండో టీ20లో స్పినర్లపై ఎదురుదాడికి దిగుతాం వారి పై ఒత్తిడి తీసుకువస్తాం. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు అన్ని విధాలుగా ప్రయత్రిస్తామని చెప్పుకొచ్చాడు. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వైస్ కెప్టెన్‌గా నియమితులు కావడంపైనా స్పందించాడు. జోస్ బట్లర్ ఎంతో అనుభవజ్ఞుడు. అతడికి అవసరం అయితే కొన్ని సూచనలు ఇచ్చేందుకు నేనెప్పుడు సిద్ధం. అయితే.. అతడు నా వద్దకు వస్తేనే నా అభిప్రాయం చెబుతాను. అవి పాటించాలా వద్దా అనేది అతడి ఇష్టం అని బ్రూక్ అన్నాడు.
హ్యారీ బ్రూక్ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. అంతర్జాతీయ ప్లేయర్లు అన్న తరువాత అన్ని కండీషన్లలో ఆడాలని, ఇలాంటి కుంటి సాకులు చెప్పవద్దని కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఒక రోజు ముందు ఇంగ్లాండ్ తుది జట్టు ను ప్రకటించింది. గస్ అట్కిన్సన్ స్థానంలో బ్రైడన్ కార్సే ని తీసుకుంది.
భారత్‌తో రెండో టీ20కి ఇంగ్లాండ్ ఇదే..
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.