IND vs ENG 2nd T20 : హిస్టరీకి అడుగు దూరంలో అర్ష్ దీప్.. ఇవాళ కొట్టేస్తాడా!
టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత ముంగిట నిలిచాడు

IND vs ENG Arshdeep Singh Needs 3 Wickets In 2nd T20 To Create History
టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత ముంగిట నిలిచాడు. చెపాక్ మ్యాచ్‌లో అతడు మరో మూడు వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాదండోయ్.. అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన పేసర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలవనున్నాడు.
అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 2022లో టీ20ల్లో అరంగ్రేటం చేసిన అర్ష్‌దీప్ కేవలం 61 మ్యాచుల్లోనే 97 వికెట్లు సాధించాడు. ఇంగ్లాండ్‌తో నేడు చెన్నైలోని చెపాక్ మైదానంలో జరగనున్న రెండో టీ20 మ్యాచులో మూడు వికెట్లు తీస్తే వంద వికెట్ల క్లబ్‌లో చేరతాడు. అంతేకాదండోయ్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా నిలవనున్నాడు.
IND vs ENG : రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? శనివారం చెన్నైలో వాతావరణం ఎలా ఉంటుందంటే?
ఈ క్రమంలో అతడు పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్ రికార్డును బ్రేక్ చేయనున్నాడు. హారిస్ రవూఫ్ 71 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా అర్ష్‌దీప్ రికార్డులకు ఎక్కనున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వేగంగా 100 వికెట్లు తీసిన రికార్డు అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ ఖాన్ 53 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన ప్లేయర్లు..
రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్) – 53 మ్యాచుల్లో
సందీప్ లామిచానే (నేపాల్) – 54 మ్యాచుల్లో
వానిందు హసరంగా (శ్రీలంక) – 63 మ్యాచుల్లో
హారిస్ రవూఫ్ (పాకిస్థాన్) – 71 మ్యాచుల్లో
ఎహసాన్ ఖాన్ (హాంకాంగ్) – 71 మ్యాచుల్లో
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. చెన్నైలోని చెపాక్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత్ ఈ మ్యాచులోనూ గెలిచి ఐదు మ్యాచుల సిరీస్ లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లాలని ఆరాటపడుతోంది. అటు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తొలి టీ20కి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది.