IND vs ENG : రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? శనివారం చెన్నైలో వాతావరణం ఎలా ఉంటుందంటే?
రెండో టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే చెపాక్ మైదానంలో శనివారం వాతావరణం ఎలా ఉండనుందంటే..

IND vs ENG 2nd T20I 2025 Chennai Weather Rain Forecast and Pitch Report details
తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్‌కు దూసుకుపోయింది. ఇక శనివారం చెన్నై వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లాలని భారత్ భావిస్తోండగా.. ప్రతికారం తీర్చుకోవాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరా హోరీగా జరిగే అవకాశాలు ఉన్నాయి.
14 నెలల తరువాత జట్టులోకి వచ్చిన మహ్మద్ షమీకి తొలి టీ20లో ఆడే అవకాశం రాలేదు. కోల్‌కతా పిచ్ స్పిన్‌కు అనుకూలం అని అందుకనే ఎక్స్‌ట్రా స్పిన్ ఆప్షన్ కోసం వెళ్లడంతోనే షమీని పక్కన బెట్టాల్సి వచ్చిందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. మరి చెపాక్ మైదానంలోనైనా షమీని ఆడిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. తెలుగు కుర్రాడు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో లోకల్ భాయ్ వాషింగ్టన్ సుందర్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. మరి తుది జట్టు కూర్పు ఎలా ఉందనుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.
IND vs ENG : రెండో టీ20లో షమీ ఆడతాడా ? ఆడడా? టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన ఏంటి?
చెపాక్ పిచ్ స్వరూపం..
సాధారణంగా చెన్నైలోని చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. అంతేకాకుండా కాస్త స్లోగానూ ఉంటుంది. అయితే.. ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభంలో బ్యాటింగ్‌కు బాగానే అనుకూలించింది. రేపటి మ్యాచ్‌లో స్పిన్నర్లతో పాటు బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. చెపాక్‌లో తేమ ప్రభావం ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.
వర్షం ముప్పు ఉందా?
రెండో టీ20 మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు. చెన్నైలో శనివారం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీల ఉంటుందని అంచనా వేసింది.
ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్ జట్టు ఒక రోజు ముందే తుది జట్టును ప్రకటించింది. గస్ అట్కిన్సన్ స్థానంలో బ్రైడన్ కార్సే ని తీసుకుంది.
రెండో టీ20కి ఇంగ్లాండ్ జట్టు ఇదే..
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.