Harry Brook with his girlfriend Lucy Lyles
Harry Brook: ఐపీఎల్ -2023 సీజన్‌లో అత్యంత ధర పలికిన ఆటగాడు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్రూక్‌ను రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ -2023 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. వరుసగా మూడు మ్యాచ్‌లలో 13, 3, 13 పరుగులతో బ్రూక్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో హ్యారీపై విమర్శలు వెల్లువెత్తాయి. 13కోట్లు వృథా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురిసింది. తాజా నెటిజన్ల కామెంట్లకు హ్యారీ బ్రూక్ బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు. శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు.
IPL 2023, KKR vs SRH: కోల్‌కతాపై సన్‌రైజర్స్ విజయం
తొలుత సన్‌రైజర్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్‌గా వచ్చిన హ్యారీ బ్రూక్ తొలి బంతి నుంచి కోల్‌కతా బౌలర్లపై విరుచుకు పడ్డాడు. మ్యాచ్ పూర్తయ్యేవరకు బ్రూక్ దూకుడు కొనసాగింది. సెంచరీతో అజేయంగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు నాటౌట్‌గా క్రీజ్‌లో నిలిచిన బ్రూక్.. 55 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సులతో 100 పరుగులు చేశాడు. మధ్య ఓవర్లలో స్పినర్లను ఎదుర్కోవడంలో కొంత ఇబ్బంది పడిన బ్రూక్.. చివరి ఓవర్లలో బౌలర్లపై దూకుడును మరింత పెంచాడు. దీంతో, తనపై వస్తున్న విమర్శలకు సెంచరీతో బ్రూక్ సమాధానం ఇచ్చాడు.
మ్యాచ్ అనంతరం హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. స్పిన్ ఆడడంలో కాస్త ఇబ్బందికి గురైనట్లు చెప్పాడు. కానీ పవర్ ప్లేను వీలైనంత మేర సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నామని, ఆ మేరకు మా ఫ్లాన్ వర్కౌంట్ అయిందని అన్నాడు. నేను ఐపీఎల్ ఆడుతున్నానని తెలిసి స్వయంగా నా ఆటను తిలకించేందుకు ఫ్యామిలీ మొత్తం ఇండియాకు వచ్చింది. అయితే, వారు కొన్ని కారణాల వల్ల వెళ్లిపోయారు.
Harry Brook: సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్.. రూ.13 కోట్లకు న్యాయం చేశాడు
తొలి మూడు మ్యాచ్‌లలో నా ఆటను చూసి వారు నన్ను తిట్టి వెళ్లిపోయారు. నా గర్ల్‌ఫ్రెండ్ ఒక్కతే ఇక్కడ ఉంది. వాళ్లు వెళిపోగానే బాగా ఆడతానని నాకు తెలుసు. నా గర్ల్‌ఫ్రెండ్ చూస్తుండగా సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉంది, స్వదేశానికి వెళ్లిన నా ఫ్యామిలీ సభ్యులు నా ఇన్నింగ్స్ చూసి షాక్ అవుతారు.. అంటూ హ్యారీ బ్రూక్ నవ్వేశాడు.
https://twitter.com/mufaddal_vohra/status/1646904160644898816?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1646904160644898816%7Ctwgr%5Ed7db51f71667035e6bb2677e430271aa7d94ec11%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fsports%2Fharry-brook-said-my-girlfriend-here-rest-family-just-left-1584833