IPL 2023: పాయింట్ల పట్టికలో టాప్‌లో, చిట్టచివరి స్థానంలో ఏ జట్లు? ఆరెంజ్ క్యాప్ పోటీలో ఎవరిది ముందంజ?
IPL 2023: టీమ్ పరంగా రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది. ఇక బ్యాటింగ్ లో శిఖర్ ధావన్ మెరుపులు మెరిపిస్తున్నాడు.

IPL 2023 Points Table
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023)లో తొలి 18 మ్యాచులు ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఏ టీమ్ ఉందో, చిట్టచివరి స్థానంలో ఏ జట్టు ఉందో చూద్దాం. ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు ఉన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, లఖ్ నవూ సూపర్ జెయింట్స్ ఆడుతున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటి నుంచి అగ్రస్థానంలోనే ఉంటూ అదగొడుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కనీసం ఒక్క మ్యాచు కూడా గెలవకుండా చిట్టచివరి స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ మొత్తం నాలుగు మ్యాచు ఆడి మూడింట్లో గెలిచి, ఒక మ్యాచు ఓడిపోయింది. దీంతో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. లఖ్ నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కు కూడా ఆరేసి పాయింట్లు ఉన్నాయి. అయితే, ఆ రెండు జట్ల కంటే రన్ రేట్ అధికంగా ఉండడంతో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

IPL 2023 Points Table
ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు మ్యాచులు ఆడి ఒక్క మ్యాచు కూడా గెలవలేదు. 0 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు మ్యాచులు ఆడి ఒక మ్యాచు మాత్రమే గెలిచింది. రన్ రేటు కూడా తక్కువగానే ఉండడంతో చివరి నుంచి రెండో స్థానంలో హైదరాబాద్ జట్టు ఉంది.
ఆరెంజ్ క్యాప్ (అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్ కు ఇచ్చే క్యాప్) లీడర్ బోర్డులో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఇప్పటివరకు 4 మ్యాచులు ఆడి 233 పరుగులు చేశాడు. ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ వార్నర్ 4 మ్యాచులు ఆడి 209 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇచ్చే క్యాప్) లీడర్ బోర్డులో చాహెల్ (10 వికెట్లు) అగ్రస్థానం ఉండగా, రషీద్ ఖాన్ (9 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు.
IPL Bowling records: ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు వీరే..