Haryana minister : జూనియర్ అథ్లెటిక్ కోచ్‌పై హర్యానా మంత్రి లైంగికవేధింపులు… చార్జ్ షీట్ దాఖలు
జూనియర్ అథ్లెటిక్స్ కోచ్‌పై లైంగిక వేధింపుల కేసులో హర్యానా మంత్రి, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్‌పై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. జూనియర్ అథ్లెటిక్స్ కోచ్‌పై లైంగిక వేధింపుల కేసులో చండీగఢ్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సిజెఎం) కోర్టులో పోలీసులు 700 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు.....

Haryana minister Sandeep Singh
Haryana minister : జూనియర్ అథ్లెటిక్స్ కోచ్‌పై లైంగిక వేధింపుల కేసులో హర్యానా మంత్రి, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్‌పై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. జూనియర్ అథ్లెటిక్స్ కోచ్‌పై లైంగిక వేధింపుల కేసులో చండీగఢ్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సిజెఎం) కోర్టులో పోలీసులు 700 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. (Haryana minister Sandeep Singh charged) హర్యానా మంత్రి సందీప్ పై ఐపీసీ సెక్షన్ 354, 354 ఎ, 342, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Madhurai Train Fire Accident : మధురై రైలు బోగీల్లో ఘోర అగ్నిప్రమాదం, అయిదుగురి మృతి
ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ఈ కేసులో దోషి అని తేలితే అయిదు సంవత్సరాల జైలు శిక్షతోపాటు జరిమానా విధించవచ్చు. ఈ కేసులో నాన్-బెయిలబుల్, వారంట్ లేకుండానే నిందితులను అరెస్టు చేయడానికి పోలీసులకు అనుమతినిస్తుంది. ఛార్జిషీట్‌లో దాఖలు చేయడానికి ముందు చండీగఢ్ పోలీసులు ఏడు సార్లు బాధితురాలిని విచారించిన అనంతరం నేరానికి సంబంధించిన వివరణాత్మక సంఘటనలను ప్రస్థావించారు.
Modi Isro visit : చంద్రయాన్-3 హీరోలకు ప్రధాని మోదీ శాల్యూట్
ఛార్జిషీట్‌లో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికను కూడా పొందుపర్చారు. ఈ కేసును జనవరి 1వతేదీన మహిళా ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. కేసు నమోదైన తర్వాత జనవరి 1న సందీప్ సింగ్ తన స్పోర్ట్స్ పోర్ట్‌ఫోలియోను వదులుకున్నారు. చండీగఢ్‌లోని తన అధికారిక నివాసంలో తనను కలవాలని మంత్రి కోరాడని, తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదుదారు తెలిపారు.