Mohammed Shami-Hasin Jahan : రూ.4లక్షలు చాలా తక్కువ.. రూ.10లక్షలు కావాలి.. షమీ భార్య హసీన్ జహాన్
కోర్టు తీర్పుపై షమీ భార్య హసీన్ జహాన్ స్పందించింది.

hasin comment on mohammed shami alimony
టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ షమీ.. తన భార్య, కూతురు సంరక్షణ కొరకు నెలకు రూ.4లక్షల భరణం కింద చెల్లించాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రూ.1.5 లక్షలు అతడి భార్య హసీన్ జహాన్‌కు, రూ.2.5 లక్షలు కూతురు కోసం అని పేర్కొంది.
కాగా.. కోర్టు తీర్పుపై షమీ భార్య హసీన్ జహాన్ స్పందించింది. సుదీర్ఘంగా చేసిన పోరాటానికి దక్కిన విజయం ఇది అన్నారు. అదే సమయంలో రూ.4లక్షలు చాలా తక్కువ అమౌంట్ అని.. రూ.10లక్షలు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. అయినప్పటికి న్యాయస్థానం తీర్పుతో తన కూతురికి మంచి విద్యను అందించగలనని తెలిపారు.
‘షమీ స్థాయి, అతడి జీవన విధానం బట్టి చూస్తే ఈ భరణం చాలా తక్కువ. అతడి నుంచి రూ.10లక్షలు ఇప్పించాలని ఏడేళ్ల కిందటే న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాం. అప్పటి నుంచి అతడి ఆదాయం, ఖర్చులు పెరిగాయి. షమీ తన జీవితాన్ని ఎలా గడుపుతున్నారో.. నేను, నా కూతురు అదే స్థాయిలో జీవించే హక్కు ఉంది.’ అని జహాన్ తెలిపింది.
షమీ, హసీన్ లు 2014లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కూతురు మంది. కాగా.. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వీరిద్దరు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 2018లో షమీపై హసీన్ గృహ హింస, దాడి, వరకట్న వేధింపులు వంటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ENG vs IND : పాపం రవీంద్ర జడేజా.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదురా అయ్యా..
భరణం పెరిగే అవకాశం ఉంది..
కాగా.. 2018 నుంచి హసీన్ జహాన్ ఇబ్బంది పడినట్లు ఆమె తరుపు న్యాయవాది ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఇప్పుడు న్యాయస్థానం తీసుకున్న నిర్ణయంతో ఆమెకు న్యాయం జరిగిందన్నారు. జహాన్ ఖర్చుల కోసం రూ.1.5లక్షలు, కూతురి కోసం రూ.2.5లక్షలు చొప్పున చెల్లించాలి. ఇంకా కూతురికి ఏమైన అవసరం అయితే షమీ వాటిని అందించాలని చెప్పారు.
మధ్యంతర ఉత్తర్వుల్లోని ప్రధాన దరఖాస్తును ట్రయల్ కోర్టు ఆరు నెలల్లో పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో భరణంపై విచారణ ముగిసే నాటికి ఆమెకు ఇప్పుడున్న రూ.4లక్షలను రూ.6లక్షల వరకు పెంచే అవకాశం లేకపోలేదన్నారు.