ENG vs IND : పాపం ర‌వీంద్ర జ‌డేజా.. నీ క‌ష్టం ప‌గ‌వాడికి కూడా రాకూడ‌దురా అయ్యా..

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఓ స‌ర‌దా సంఘ‌ట‌న చోటు చేసుకుంది

ENG vs IND : పాపం ర‌వీంద్ర జ‌డేజా.. నీ క‌ష్టం ప‌గ‌వాడికి కూడా రాకూడ‌దురా అయ్యా..

ENG vs IND Jadeja was involved in a hilarious incident during 2nd test

Updated On : July 4, 2025 / 10:43 AM IST

టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (269; 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) ద్విశ‌తకంతో చెల‌రేగ‌డంతో ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ప‌టిష్ట స్థితిలో నిలిచింది. గిల్‌తో పాటు ర‌వీంద్ర జ‌డేజా (89; 137 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించ‌డంతో భారత్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది.

ఆ త‌రువాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి మూడు వికెట్లు కోల్పోయి 77 ప‌రుగులు చేసింది. జోరూట్ (18), హ్యారీ బ్రూక్ (30) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ ఇంకా 510 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.

ENG vs IND : శుభ్‌మ‌న్ గిల్ 300 మిస్‌.. పంత్‌, భార‌త బ్యాటింగ్ కోచ్ సంబ‌రాలు?

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఓ స‌ర‌దా సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్‌ను సిరాజ్ వేశాడు. తొలి బంతిని జాక్ క్రాలీ షాట్ ఆడాడు. బంతి ర‌వీంద్ర జ‌డేజాకు కాస్త ప‌క్క‌గా వెలుతోంది. వెంట‌నే జ‌డేజా త‌న ఎడ‌మ చేతి వైపుకు డైవ్ చేసి బంతిని ఆపాడు.

Shubman Gill : బ్యాటింగ్ ఆస్వాదించడం మానేశాను.. రెండో టెస్టులో భారీ ద్విశ‌త‌కం త‌రువాత శుభ్‌మ‌న్ గిల్ కామెంట్స్‌..

అయితే.. ఈ క్ర‌మంలో అత‌డు ప్యాంట్ ఊడిపోయింది. బంతిని వికెట్ కీప‌ర్‌కు త్రో చేసిన త‌రువాత‌ అత‌డు త‌న ప్యాంట్‌ను స‌రిచేసుకున్నాడు. దీన్ని చూసిన మైదానంలో ప్రేక్ష‌కులు, టీవీల్లోని వీక్ష‌కులు తెగ న‌వ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. పాపం జ‌డేజా ఇజ్జ‌త్ పోయిందిగా అంటూ నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.