ENG vs IND : శుభ్‌మన్ గిల్ 300 మిస్.. పంత్, భారత బ్యాటింగ్ కోచ్ సంబరాలు?
ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టులో టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆటతీరును ప్రదర్శించాడు

ENG vs IND Pant India coach celebrate as Gill misses out on 300
ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టులో టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆటతీరును ప్రదర్శించాడు. అయితే.. దురదృష్ట వశాత్తు అతడు ట్రిపుల్ సెంచరీని సాధించలేకపోయాడు. కాగా.. గిల్ ఔట్ అయిన తరువాత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, భారత్ కోచ్ సితాన్షు చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో గిల్ 387 బంతులను ఎదుర్కొన్నాడు. 30 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 269 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అతడికి ఇదే తొలి డబుల్ సెంచరీ. ఈ క్రమంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డ పై టెస్టుల్లో ద్విశతకం సాధించిన తొలి భారత, ఆసియా కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు శ్రీలంక బ్యాటర్ తిలకరత్నె దిల్షాన్ 2011లో లార్డ్స్‌లో సాధించిన 193 పరుగులే ఇంగ్లాండ్‌లో ఓ ఆసియా కెప్టెన్ అత్యధిక స్కోరు.
A mammoth innings comes to an end 🤝
India’s captain Shubman Gill departs for 2️⃣6️⃣9️⃣
🇮🇳 5️⃣7️⃣4️⃣-8️⃣ pic.twitter.com/P40bFHLk6G
— England Cricket (@englandcricket) July 3, 2025
ద్విశతకం సాధించిన భారత కెప్టెన్‌గా పటౌడీ, సునీల్ గవాస్కర్, సచిన్, ధోని, కోహ్లిల సరసన గిల్ నిలిచాడు.
ఇదిలా ఉంటే.. ఎంతో సేపు అద్భుతంగా ఆడిన గిల్.. టంగ్ షార్ట్ బౌల్ వేయగా దాన్ని పుల్ షాట్‌గా మలిచేందుకు ప్రయత్నించాడు. అయితే.. స్క్వేర్ లెగ్‌లో ఉన్న ఓలీ పోప్ ఈజీ క్యాచ్ అందుకున్నాడు. ఔటైన తరువాత పెవిలియన్‌కు వెలుతుండగా స్టాండ్స్‌లోని ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో గిల్‌ను అభినందించారు.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) July 3, 2025
శుభ్‌మాన్ గిల్ ఔట్ తర్వాత టెస్ట్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ యొక్క ఆసక్తికరమైన స్పందన కెమెరాలో రికార్డైంది. గిల్ పెవిలియన్‌కు నడుచుకుంటూ వెలుతుండగా.. రిషబ్ పంత్, సితాన్షు కోటక్ బాల్కనీలో నిలబడి ఉన్నారు. ఆ జంట ఏదో విషయం పై మాట్లాడుకుంటూ నవ్వుతూ ఒకరినొకరు కౌగలించుకుంటూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.