Heinrich Klaasen announces his retirement from international cricket
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించడం తన కల అని చెప్పాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఎంతో గౌరవంగా భావించినట్లు చెప్పుకొచ్చాడు. ఇక తన కుటుంబంతో మరింత సమయం గడప వచ్చునని అన్నాడు.
‘అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని ప్రకటించడం నాకు చాలా బాధాకరం. భవిష్యత్తులో నాకు, నా కుటుంబానికి ఏది మంచిదో నిర్ణయించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇది నిజంగా చాలా కష్టమైన నిర్ణయం. కానీ ఎంతో ప్రశాంతత లభిస్తుంది.
IPL 2025 : ఐపీఎల్ ఫైనల్ పై రాజమౌళి సంచలన పోస్ట్.. అటు అయ్యర్, ఇటు కోహ్లీ.. హార్ట్ బ్రేక్..
దేశానికి ప్రాతినిథ్యం వహించాలనేది నా చిన్ననాటి కల. ఆ అవకాశం లభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ప్రోటీస్ తరపున ఆడటం వల్ల నా జీవితాన్ని మార్చిన గొప్ప వ్యక్తులను కలిసే అవకాశం లభించింది. గొప్ప స్నేహాలు పొందాను. నాకు సహకరించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, కోచ్‌లకు కృతజ్ఞతలు. నా ఛాతీపై ప్రోటీస్ బ్యాడ్జ్‌తో ఆడటం నా కెరీర్‌లో అతిపెద్ద గౌరవం గా భావిస్తున్నాను. నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నేను ఎదురు చూస్తున్నాను ఎందుకంటే ఈ నిర్ణయం నాకు అలా చేయడానికి వీలు కల్పిస్తుంది.’ అని హెన్రిచ్ క్లాసెన్ రాసుకొచ్చాడు.
Preity Zinta : కన్నుగీటిన ప్రీతి జింటా.. ఆ యువఆటగాడిని చూసేనా?
2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన హెన్రిచ్ క్లాసెన్.. దక్షిణాఫ్రికా తరుపున నాలుగు టెస్టులు, 60 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 60 వన్డేల్లో 43.7 సగటుతో 2141 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు ఉన్నాయి. 58 టీ20ల్లో 23.2 సగటుతో వెయ్యి పరుగులు చేశాడు. 4 టెస్టుల్లో 13 సగటుతో 104 పరుగులు చేశాడు.