Preity Zinta : కన్నుగీటిన ప్రీతి జింటా.. ఆ యువఆటగాడిని చూసేనా?
శ్రేయస్ అయ్యర్ విన్నింగ్ షాట్ కొట్టగానే పంజాబ్ హెడ్ కోచ్ పాంటింగ్‌తో పాటు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది సంబురాల్లో మునిగిపోయారు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు చేరుకుంది. క్వాలిఫయర్-2లో ముంబై పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 11 ఏళ్ల తరువాత పంజాబ్ జట్టు ఫైనల్‌కు చేరుకోవడంతో ఆ జట్టు ప్లేయర్లు, కోచింగ్ సిబ్బంది ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
శ్రేయస్ అయ్యర్ విన్నింగ్ షాట్ కొట్టగానే.. పంజాబ్ హెడ్ కోచ్ పాంటింగ్‌తో పాటు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది సంబురాల్లో మునిగిపోయారు. ఇక ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా అయితే.. తన చేతులతో గాల్లో చప్పట్లు కొడుతూ మైదానంలోకి పరిగెత్తింది. గ్రౌండ్‌లో తిరుగుతూ సందడి చేసింది. కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లను కౌగలించుకుంది.
BCCI : బీసీసీఐకి కొత్త బాస్..!
కాగా.. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో ప్రీతి జింటా మైదానంలో పంజాబ్ ఆటగాళ్లలో ఒకరి వైపు చూస్తూ కన్నుగీటింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ యువ ఆటగాడు ఉన్నాడు. అతడిని చూసే ఆమె ఇలా చేసిందా? లేక అతడి వెనుక ఇంకెవరు అయినా ఉన్నారా? అన్న విషయాలు తెలియరాలేదు. ఏదీ ఏమైనప్పటికి ప్రీతీ జింటా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. తిలక్ వర్మ (44), సూర్యకుమార్ యాదవ్ (44) లు వేగంగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా రెండు వికెట్లు, జేమీసన్, విజయ్ కుమార్ వైశక్, చాహల్‌లు తలా ఓ వికెట్ తీశారు.
PBKS vs MI : మ్యాచ్ తరువాత శ్రేయస్ అయ్యర్ కోపం చూశారా? సహచర ఆటగాడిపైనే..
Please,Iyer ! win the IPL for Preity Zinta. pic.twitter.com/xTUFWSBpzY
— Watch Analyze React (@war_dot_com) June 2, 2025
ఆ తరువాత శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 87 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు నేహల్ వధేరా (29 బంతుల్లో 48 పరుగులు)దంచికొట్టడంతో భారీ లక్ష్యాన్ని పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. ముంబై బౌలర్లలో అశ్వనీకుమార్ రెండు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలా ఓ వికెట్ తీశారు.