IPL 2025 : ఐపీఎల్ ఫైనల్ పై రాజమౌళి సంచలన పోస్ట్.. అటు అయ్యర్, ఇటు కోహ్లీ.. హార్ట్ బ్రేక్..
ఐపీఎల్ 2025 ఫైనల్ పై దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు చేరుకుంది. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి 11 ఏళ్ల తరువాత పంజాబ్ జట్టు ఐపీఎల్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-2తో పాటు పంజాబ్ ను ఫైనల్‌కు చేర్చడంలో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడి పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి సైతం అయ్యర్ పై ప్రశంసలు కురిపించాడు.
ఆధునిక క్రికెట్‌లో అరివీర భయంకర బౌలర్లు అయిన జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్డ్ యార్కర్లను థర్డ్ మ్యాన్ దిశగా తరలించి శ్రేయస్ బౌండరీలు రాబట్టడాన్ని రాజమౌళి కొనియాడాడు. శ్రేయస్ బ్యాటింగ్ చూడ చక్కగా ఉందన్నాడు. పంజాబ్ కింగ్స్ ను 11 ఏళ్ల తరువాత ఫైనల్ కు తీసుకువచ్చిన అయ్యర్.. టైటిల్ అందుకునేందుకు పూర్తి అర్హుడని చెప్పారు.
Preity Zinta : కన్నుగీటిన ప్రీతి జింటా.. ఆ యువఆటగాడిని చూసేనా?
Iyer guiding Bumrah’s and Boult’s yorkers to the third man boundary… Exquisite…
This man leads Delhi to a final… and is dropped…
Leads Kolkata to a trophy… dropped…
Leads a young Punjab to the finals after 11 years.
He deserves this year’s trophy too…On the other hand,… pic.twitter.com/ws0anhcZ3l
— rajamouli ss (@ssrajamouli) June 2, 2025
మరోవైపు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ తరుపున వేల పరుగులు సాధించాడని, ఐపీఎల్ టైటిల్ అందుకునేందుకు అతడు కూడా అర్హుడు అని రాజమౌళి అన్నారు. మొత్తంగా ఫైనల్‌లో ఎవరు గెలిచినా కూడా హార్ట్ బ్రేక్ మాత్రం తప్పదని ట్వీట్ చేశారు.
జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్డేడియంలో ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఐపీఎల్ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి.