KL Rahul Ton
KL Rahul Ton : సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో కేఎల్ రాహుల్ సెంచరీ(101)తో మెరిశాడు. సఫారి పేసర్ల ధాటికి సహచరులంతా ఓ వైపు పెవిలియన్‌కు చేరుకుంటున్నా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రాహుల్ మాత్రం పట్టుదలతో క్రీజులో నిలిచాడు. రాహుల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేసింది. రాహుల్ తరువాత అత్యధిక స్కోరు విరాట్ కోహ్లి (38) కావడం గమనార్హం.
92 పరుగులకే నాలుగు వికెట్లు భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి అడుగుపెట్టాడు రాహుల్. పిచ్ బ్యాటింగ్‌కు కష్టతరంగా ఉన్నప్పటికీ పోరాటపటిమ కనబరిచాడు. ఆఖరి వరుస బ్యాటర్లతో కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. 137 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 14 ఫోర్లు నాలుగు సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ దశలో కేఎల్ రాహుల్ సెంచరీ చేస్తాడా, లేదా అనే అనుమానం కలిగింది.
కీపర్ నిర్లక్ష్యం.. రాహుల్‌కు కలిసొచ్చింది..
ఇన్నింగ్స్ 66వ ఓవర్‌ను గెరాల్డ్ కోయెట్జీ వేశాడు. ఈ ఓవర్‌లో మొదటి బంతికి సిరాజ్ ఔట్ అయ్యాడు. దీంతో భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఆఖరి బ్యాటర్‌గా ప్రసిద్ధ్ కృష్ణ క్రీజులోకి అడుగుపెట్టాడు. రెండో బంతిని అతడు ఎదుర్కొన్నాడు. ఇక మూడో బంతిని కోయెట్జీ లైగ్ దిశగా వేశాడు. ప్రసిద్ధ్ దాన్ని వదిలివేశాడు. బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఈ సమయంలో భారత బ్యాటర్లు బై రూపంలో సింగిల్ తీశారు.
Also Read : ప్రతిష్టాత్మక గ్రౌండ్‌లో పాకిస్తాన్ చెత్త రికార్డు.. చరిత్రలో ఏ జట్టు కూడా..
ఈ సమయంలో కీపర్ అప్రమత్తంగా లేడు. భారత బ్యాటర్లు ఇలా చేస్తారని అతడు ఏ మాత్రం ఊహించలేదనుకుంటా. బంతిని అందుకున్న అతడు ఇటు వైపు చూడకుండానే రెండో స్లిప్ వైపు బంతిని విసిరాడు. ఒకవేళ అతడు గనుక స్టంప్స్ వైపును బాల్ విసిరి ఉంటే రాహుల్ రనౌట్ అయ్యేవాడు. శతకాన్ని అందుకునే వాడు కాదు. అప్పటికి రాహుల్ స్కోరు 94 పరుగులు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతిని సిక్స్‌గా మలిచిన రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read : విరాట్ కోహ్లికి షాకిచ్చిన స్టార్‌స్పోర్ట్స్..! మండిపడుతున్న ఫ్యాన్స్..
Out of context Cricket pic.twitter.com/lfYkObMWZH
— Tweeter (@ImShivaji) December 27, 2023