Virat kohli : విరాట్ కోహ్లికి షాకిచ్చిన స్టార్‌స్పోర్ట్స్..! మండిపడుతున్న ఫ్యాన్స్..
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులు ప్రముఖ స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పై మండిపడుతున్నారు.

Virat kohli
Virat kohli-Star Sports : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులు ప్రముఖ స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. ఈ సంవత్సరం టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను ఎంపిక చేసిన స్టార్ స్పోర్ట్స్.. టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అంటూ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో విరాట్ కోహ్లికి స్థానం దక్కలేదు. దీంతో అభిమానులు స్టార్ స్పోర్ట్స్‌పై విరుచుకుపడుతున్నారు.
భారత్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజా. రవిచంద్రన్ అశ్విన్ లకు మాత్రమే స్థానం దక్కింది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులోని తొలి రోజు లంచ్ విరామ సమయంలో ఈ జట్టును ప్రకటించింది. ఓపెనర్లుగా ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా, భారత కెప్టెన్ రోహిత్ శర్మకు స్థానం కల్పించింది. ఇక మూడు, నాలుగు స్థానాల్లో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లను ఎంపిక చేసింది.
Babar Azam : అలా ఎలా నేను ఔట్ అయ్యాను..! తెల్లముఖం వేసిన బాబర్ ఆజం.. వీడియో వైరల్
ఇక ఐదో స్థానంలో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు ట్రావిస్ హెడ్‌కు స్థానం దక్కింది. వికెట్ కీపర్ కోటాలో ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో, ఆల్‌రౌండర్ల కోటాలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు చోటు ఇచ్చింది. ఇక ఫాస్ట్ బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్‌లతో పాటు ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌లకు అవకాశం ఇచ్చింది.
విరాట్ కోహ్లికి నో ఛాన్స్..
ఈ ఏడాది టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్న విరాట్ కోహ్లికి ఈ జట్టులో చోటు దక్కకపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ విషయం పై భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సైతం స్పందించాడు. ఈ సంవత్సరం టెస్టుల్లో కోహ్లి బ్యాటింగ్ యావరేజ్ 55 గా ఉందని, అలాంటి ఆటగాడికి ఇయర్ ఆఫ్ ది టీమ్‌లో స్థానం లేకపోవడం తనకు షాక్ కలిగించిందని అతడు అన్నాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లి 8 టెస్టు మ్యాచులు ఆడాడు. 54.09 సగటుతో 595 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది.
Bus now for Kohli to score a daddy 100 in this test & rub it on Star Sports Test XI. Stage is set ??????
— Anurag Rekhi (@Dravidict) December 26, 2023
Virat Kohli : విరాట్ కోహ్లీ మరో ఘనత.. రోహిత్ శర్మను అధిగమించి నంబర్ 1 స్థానానికి
స్టార్ స్పోర్ట్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ : ఉస్మాన్ ఖవాజా, రోహిత్ శర్మ, జో రూట్, కేన్ విలియమ్సన్, ట్రావిస్ హెడ్, జానీ బెయిర్ స్టో, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్.