Babar Azam : అలా ఎలా నేను ఔట్ అయ్యాను..! తెల్లముఖం వేసిన బాబర్ ఆజం.. వీడియో వైరల్
మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది.

Babar Azam bowled
Babar Azam bowled : మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 187 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లబుషేన్ (63) హాఫ్ సెంచరీ చేయగా ఉస్మాన్ ఖవాజా (42), మిచెల్ మార్ష్ (41)లు రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో అమీర్ జమాల్ మూడు వికెట్లు తీశాడు. షాహీన్ అఫ్రీది, మీర్ హంజా, హసన్ అలీ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అగా సల్మాన్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం పాకిస్తాన్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (29), అమీర్ జమాల్ (2)లు క్రీజులో ఉన్నారు. అబ్దుల్లా షఫీక్ (62), షాన్ మసూద్ (54)లు హాఫ్ సెంచరీలు చేశారు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ పరుగులకు పాకిస్తాన్ ఇంకా 124 పరుగుల దూరంలో ఉంది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా, నాథన్ లయన్ రెండు, జోష్ హేజిల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు.
Virat Kohli : విరాట్ కోహ్లీ మరో ఘనత.. రోహిత్ శర్మను అధిగమించి నంబర్ 1 స్థానానికి
బాబర్ ఆజంకు ఫ్యూజ్‌లు ఔట్..
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఆ జట్టు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన బాబర్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ వేసిన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌కు బాబర్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆఫ్‌సైడ్ పడిన బంతి టర్న్ అవుతూ.. బాబర్ బ్యాట్, ప్యాడ్ మధ్య ఉన్న ఖాళీ నుంచి వెళ్లి బెయిల్స్‌ను పడగొట్టింది. దీన్ని చూసిన బాబర్ తెల్లముఖం వేశాడు. బంతి అలా ఎలా వెళ్లి వికెట్లు పడగొట్టిందనే అయోమయంలో బాబర్ పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
UNBELIEVABLE!
Pat Cummins gets rid of Babar Azam again – with another BEAUTY! #OhWhatAFeeling @Toyota_Aus #AUSvPAK pic.twitter.com/iXQ6M7E10l
— cricket.com.au (@cricketcomau) December 27, 2023