Virat Kohli : విరాట్ కోహ్లీ మరో ఘనత.. రోహిత్ శర్మను అధిగమించి నంబర్ 1 స్థానానికి

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు.

Virat Kohli : విరాట్ కోహ్లీ మరో ఘనత.. రోహిత్ శర్మను అధిగమించి నంబర్ 1 స్థానానికి

Virat Kohli

Updated On : December 27, 2023 / 1:05 PM IST

Virat Kohli Surpasses Rohit Sharma : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో కోహ్లీ సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2019-2025 లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా విరాట్ నిలిచాడు. రోహిత్ శర్మను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు.కోహ్లీ 57 ఇన్నింగ్స్ లలో 2,101 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 42 ఇన్నింగ్స్ లలో 2,097 పరుగులు చేశాడు. కోహ్లీ, రోహిత్ శర్మ తరువాత 62 ఇన్నింగ్స్ లలో 1,769 పరుగులతో చెతేశ్వర్ పుజారా మూడో స్థానంలో నిలిచాడు. ఆ తరువాత స్థానాల్లో అజింక్య రహానే 49 ఇన్నింగ్స్ లో 1,589 పరుగులు, రిషబ్ పంత్ 41 ఇన్నింగ్స్ లలో 1,575 పరుగులు చేశారు.

Also Read : David Warner : ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు.. ఆ దేశం తరపున రెండో ప్లేయర్ అతనే

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ మినహా భారత్ టాప్ బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ 70 (105 బంతులు) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 59 ఓవర్లు ఎదుర్కొని ఎనిమిది వికెట్లు కోల్పోయారు 208 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. తొలిరోజు వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. రెండోరోజు ఆటలో భారత్ బ్యాటర్లు స్కోర్ ను పెంచే ప్రయత్నంలో సఫలమవుతారా? విఫలమవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.