AUS vs PAK : ప్ర‌తిష్టాత్మ‌క గ్రౌండ్‌లో పాకిస్తాన్ చెత్త రికార్డు.. చ‌రిత్ర‌లో ఏ జ‌ట్టు కూడా..

టెస్టు క్రికెట్‌లో పాకిస్తాన్ జ‌ట్టు ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది.

AUS vs PAK : ప్ర‌తిష్టాత్మ‌క గ్రౌండ్‌లో పాకిస్తాన్ చెత్త రికార్డు.. చ‌రిత్ర‌లో ఏ జ‌ట్టు కూడా..

Pakistan bowlers created an unwanted record

Updated On : December 27, 2023 / 4:36 PM IST

Australia vs Pakistan : టెస్టు క్రికెట్‌లో పాకిస్తాన్ జ‌ట్టు ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో పాక్‌ అవాంఛిత రికార్డును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 318 ప‌రుగులు చేసింది. మార్న‌స్ ల‌బుషేన్ (63) హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఉస్మాన్ ఖ‌వాజా (42), మిచెల్ మార్ష్ (41), డేవిడ్ వార్న‌ర్ (38) లు రాణించారు. పాక్‌ బౌల‌ర్ల‌లో అమీర్ జమాల్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు, షాహీన్ అఫ్రీది, మీర్ హంజా, హసన్ అలీ లు త‌లా రెండు వికెట్లు తీశారు. అగా సల్మాన్ ఓ వికెట్ సాధించాడు.

కాగా.. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 52 ప‌రుగుల‌ను ఎక్స్‌ట్రా ల రూపంలో ఇచ్చింది. ఈ క్ర‌మంలో ఓ చెత్త రికార్డును న‌మోదు చేసింది. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక ఎక్స్‌ట్రాలు ఇచ్చిన జ‌ట్టుగా పాక్ ఎవ్వ‌రూ కోరుకుని రికార్డును అందుకుంది. ఎక్స్‌ట్రాస్‌లో 15 వైడ్‌లు, 20 బైలు, 2 నోబాల్స్‌ ఉన్నాయి.

KL Rahul : కేఎల్ రాహుల్ అరుదైన ఘ‌న‌త‌.. సెంచూరియ‌న్‌లో ఒకే ఒక్క‌డు

అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాక్‌.. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆరు వికెట్లు కోల్పోయి 194 ప‌రుగులు చేసింది. మహ్మ‌ద్ రిజ్వాన్ (29), అమీర్ జమాల్ (2)లు క్రీజులో ఉన్నారు. అబ్దుల్లా షఫీక్ (62), షాన్ మసూద్ (54)లు అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించారు. ఆస్ట్రేలియా మొద‌టి ఇన్నింగ్స్ స్కోరుకు పాకిస్తాన్ ఇంకా 124 ప‌రుగుల దూరంలో ఉంది. ఆసీస్ బౌల‌ర్ల‌లో పాట్ క‌మిన్స్ మూడు వికెట్లు తీయ‌గా, నాథ‌న్ ల‌య‌న్ రెండు, జోష్ హేజిల్‌వుడ్ లు ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

కాగా.. 1995 నుంచి పాకిస్తాన్ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెల‌వ‌లేదు. మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో కొన‌సాగుతోంది. రెండో టెస్టు మ్యాచులో సైతం ఆస్ట్రేలియా క్ర‌మంగా ప‌ట్టు బిగిస్తోంది.

Virat kohli : విరాట్ కోహ్లికి షాకిచ్చిన స్టార్‌స్పోర్ట్స్‌..! మండిప‌డుతున్న ఫ్యాన్స్‌..