KL Rahul : కేఎల్ రాహుల్ అరుదైన ఘ‌న‌త‌.. సెంచూరియ‌న్‌లో ఒకే ఒక్క‌డు

టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

KL Rahul : కేఎల్ రాహుల్ అరుదైన ఘ‌న‌త‌.. సెంచూరియ‌న్‌లో ఒకే ఒక్క‌డు

KL Rahul

Updated On : December 27, 2023 / 3:19 PM IST

KL Rahul ton : టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. సెంచూరియ‌న్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచులో అత‌డు సెంచ‌రీ (101) చేశాడు. ఈ మైదానంలో రాహుల్‌కు ఇది రెండో సెంచ‌రీ. ఈ క్ర‌మంలో సెంచూరియన్ మైదానంలో రెండు సెంచరీలు చేసిన తొలి విదేశీ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ చ‌రిత్ర సృష్టించాడు. ఇంత‌క‌ముందు 2021/22లో ప‌ర్య‌ట‌న‌లో ఇదే మైదానంలో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన రాహుల్ 123 ప‌రుగులు చేశాడు.

ఇక ద‌క్షిణాఫ్రికాలో ఆసియా బ్యాట‌ర్ల‌లో అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన ఆట‌గాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భార‌త దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ 5 సెంచ‌రీల‌తో మొద‌టి స్థానంలో ఉన్నాడు. అజ‌ర్ మ‌హ‌మూద్‌, టి.స‌మ‌ర‌వీర‌, విరాట్ కోహ్లీల‌తో పాటు కేఎల్ రాహుల్ రెండు శ‌త‌కాలు బాదాడు.

Virat kohli : విరాట్ కోహ్లికి షాకిచ్చిన స్టార్‌స్పోర్ట్స్‌..! మండిప‌డుతున్న ఫ్యాన్స్‌..

సౌతాఫ్రికాలో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆసియా బ్యాట‌ర్లు..

స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్‌) – 5 సెంచ‌రీలు
అజ‌ర్ మ‌హ‌మూద్ (పాకిస్తాన్‌) -2
టి.స‌మ‌ర‌వీర (శ్రీలంక‌) – 2
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 2
కేఎల్ రాహుల్ (భార‌త్‌) – 2

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 245 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్ సూప‌ర్ శ‌త‌కం సాధించాడు. విరాట్ కోహ్లీ (38), శ్రేయ‌స్ అయ్య‌ర్ (31), శార్దూల్ ఠాకూర్ (24) లు ఓ మోస్త‌రుగా రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో క‌గిసొ ర‌బాడ ఐదు వికెట్లు తీశాడు. నాండ్రీ బర్గర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మార్కొ జాన్సెన్‌, గెరాల్డ్ కోయెట్జీ లు చెరో వికెట్ సాధించారు.

Babar Azam : అలా ఎలా నేను ఔట్ అయ్యాను..! తెల్ల‌ముఖం వేసిన బాబర్ ఆజం.. వీడియో వైర‌ల్‌