Jos Buttler Century : ఆఖ‌ర్లో బ‌ట్ల‌ర్ సెంచ‌రీ పై ఉత్కంఠ‌.. షిమ్రాన్ హెట్మెయ‌ర్ స‌ల‌హాతో పూర్తి..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ ఎట్ట‌కేల‌కు ఫామ్ అంకున్నాడు.

Jos Buttler Century : ఆఖ‌ర్లో బ‌ట్ల‌ర్ సెంచ‌రీ పై ఉత్కంఠ‌.. షిమ్రాన్ హెట్మెయ‌ర్ స‌ల‌హాతో పూర్తి..

PIC credit @ RR twitter

Jos Buttler : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ ఎట్ట‌కేల‌కు ఫామ్ అంకున్నాడు. శ‌నివారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో శ‌త‌కంతో చెల‌రేగాడు. 184 ల‌క్ష్య‌ఛేద‌న‌లో ఆఖ‌రి వ‌ర‌కు క్రీజులో నిలిచి జ‌ట్టును గెలిపించాడు. దీంతో ఈ సీజ‌న్‌లో రాజ‌స్థాన్ వ‌రుస‌గా నాలుగో విజ‌యాన్నిన‌మోదు చేసింది. ఈ మ్యాచ్‌లో బ‌ట్ల‌ర్ 58 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 100 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

ఆఖ‌ర్లో బ‌ట్ల‌ర్ సెంచ‌రీ పై ఉత్కంఠ‌..

విరాట్ కోహ్లి (72 బంతుల్లో 113 నాటౌట్‌) సెంచ‌రీ చేయ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు మూడు వికెట్లు కోల్పోయి 183 ప‌రుగులు చేసింది. 184 ప‌రుగుల‌ ల‌క్ష్య ఛేద‌న‌లో 19 ఓవ‌ర్లు పూర్తి అయ్యే స‌రికి రాజ‌స్థాన్ నాలుగు 183 ప‌రుగులు చేసింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో రాజ‌స్థాన్ విజ‌యానికి ఒక్క ప‌రుగు అవ‌స‌రం కాగా.. క్రీజులో హెట్మెయ‌ర్ (11), బ‌ట్ల‌ర్ (94) లు ఉన్నారు.

స్ట్రైకింగ్ ఎండ్‌లో బ‌ట్ల‌ర్ ఉన్నాడు. సెంచ‌రీ చేయాలంటే బ‌ట్ల‌ర్ సిక్స్ కొట్టాల్సిందే. ఈ స‌మ‌యంలో బ‌ట్ల‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చిన షిమ్రాన్ హెట్మెయ‌ర్ వికెట్ల‌కు ప‌క్క‌కు జ‌రిగి బంతిని బ‌లంగా కొట్ట‌మ‌ని స‌ల‌హా ఇచ్చాడు. అప్పుడు బంతి ఖ‌చ్చితంగా బౌండ‌రీ లైన్ దాటుంద‌న్నాడు.

Jos Buttler : ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన జోస్ బ‌ట్ల‌ర్‌.. ఒక్క సెంచ‌రీ ఎన్నో రికార్డులు..

20ఓవ‌ర్‌ని కామెరూన్ గ్రీన్ వేశాడు. వికెట్ల‌కు ప‌క్క‌కు జ‌రిగి మొద‌టి బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా బ‌ట్ల‌ర్ సిక్స్‌బాదాడు. దీంతో మ్యాచ్ గెల‌వ‌డంతో పాటు సెంచ‌రీ పూర్తి అయింది. ఆ స‌మ‌యంలో హెట్మెయ‌ర్ తాను సెంచ‌రీ చేసినంత‌గా సంబురాలు చేసుకున్నాడు.

తాను కొట్టిన షాట్ కంటే హెట్మెయ‌ర్ సంబురాలు గొప్ప‌వ‌ని తాను భావిస్తున్నట్లు బ‌ట్ల‌ర్ మ్యాచ్ అనంత‌రం చెప్పాడు. ‘నిజానికి అత‌డు నాతో ఇలా అన్నాడు. వికెట్ల‌కు ప‌క్క‌కు జ‌రిగి షాట్ కొట్టాల‌ని సూచించాడు. అలా చేస్తే త‌ప్ప‌కుండా సిక్స్ వస్తుంది.’ అని అన్నాడు. షాట్ కొట్టిన అనంత‌రం నేను పరుగెత్తుతున్నాను.. బాల్‌ లైన్‌ను దాటాలని కోరుకున్నాన‌ని బట్లర్ చెప్పాడు. కాగా.. ఐపీఎల్‌లో బ‌ట్ల‌ర్‌కు ఇది ఆరో సెంచ‌రీ కావ‌డం విశేషం.

Virat Kohli : కోహ్లి ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే స్లోయెస్ట్ సెంచ‌రీ..

ఈ సీజ‌న్‌లో బ‌ట్ల‌ర్ ఫామ్ ఏమంత గొప్ప‌గా లేదు. బెంగ‌ళూరుతో మ్యాచ్‌కు ముందు మూడు మ్యాచులు ఆడిన బ‌ట్ల‌ర్ కేవ‌లం 35 ప‌రుగులే చేశాడు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లోనూ మొద‌ట ఇబ్బంది ప‌డిన బ‌ట్ల‌ర్ ఆ త‌రువాత చెల‌రేగి శ‌త‌కాన్ని అందుకున్నాడు.