How Suresh Raina was invited to MS Dhonis wedding
Suresh Raina – MS Dhoni : భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ల మధ్య చాలా చక్కని అనుబంధం ఉంది. వీరిద్దరూ టీమ్ఇండియా తరుపునే కాకుండా ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరుపున కలిసి ఆడారు. ఎన్నో సార్లు జట్టుకు విజయాలను అందించారు. ఇక సీఎస్‌కే అభిమానులు అంతా సురేశ్ రైనా ను ముద్దుగా చిన్న తలా అని పిలుచుకుంటారు అన్న సంగతిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆగస్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని రిటైర్‌మెంట్ ప్రకటించగా కొద్ది నిమిషాల వ్యవధిలోనే రైనా సైతం ఆటకు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధోనికి తనకు మధ్య జరిగిన ఓ సరదా ఘటనను అతడు షేర్ చేసుకున్నాడు. పెళ్లికి ధోని తనను ఎలా పిలిచాడో అన్న విషయాలను చెప్పాడు. ‘ఒక రోజు ఉదయాన్నే ధోని నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నేను ఎత్తగానే ఎక్కడ ఉన్నావు అంటూ అడిగాడు. నేను లక్నోలో ఉన్నాను అని చెప్పాను. నువ్వు త్వరగా డెహ్రాడూన్‌కు రా.. నేను పెళ్లి చేసుకుంటున్నా.. ఎవ్వరికి చెప్పొద్దు.. నీ కోసం వెయిట్ చేస్తున్నా అంటూ ఫోన్ పెట్టేశాడు.
ధోని అలా చెప్పేసరికి నేను తొందరలో మామూలు డ్రెస్‌లోనే అతడి పెళ్లికి వెళ్లాను. అక్కడికి వెళ్లిన తరువాత ధోని కోసం తెచ్చిన దుస్తులనే వేసుకుని అతడి పెళ్లిని హాజరు అయ్యాను.’ అంటూ ఆ రోజు నాటి ఘటనను ధోని గుర్తు చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ధోని-సాక్షిల వివాహం జూలై 4, 2010లో జరిగింది. ధోని తన పెళ్లిని చాలా నిరాడంబరంగా చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజనే అతడికి ఆఖరిది అని ప్రచారం జరుగుతోంది. దీనిపై ధోని ఇంత వరకు స్పందించలేదు. అయితే.. క్రికెట్ తరువాత ఏం చేయనున్నారు అనే ప్రశ్న ఇటీవల ధోనికి ఎదురైంది. క్రికెట్ తరువాత ఏం చేయాలని ఇంకా ఆలోచించలేదని మహేంద్రుడు చెప్పాడు. ఆర్మీలో ఎక్కువ సమయం గడపాలని ఉందని చెప్పాడు. ఎందుకంటే గత కొన్నాళ్లుగా ఆర్మీ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయించలేదని తెలిపాడు.
IND-W vs AUS-W : చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. ఏకైక టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా పై ఘన విజయం
This is how Dhoni invited Suresh Raina in his wedding ? pic.twitter.com/35496VgnvJ
— MAHIYANK™ (@Mahiyank_78) December 23, 2023