Usama Mir : పుట్టిన రోజు నాడు సూపర్ క్యాచ్.. కట్ చేస్తే ఔట్ ఇవ్వని అంపైర్.. బుర్ర ఎక్కడ పెట్టావు సామీ..!
తన పుట్టిన రోజు నాడు అద్భుతమైన క్యాచ్ అందుకున్న ఆనందంలో ఓ ఆటగాడు సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

Usama Mir takes brilliant catch
Usama Mir takes brilliant catch : క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని సరదా ఘటనలు చోటు చేసుకోవడాన్ని చూస్తూనే ఉన్నాం. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో అలాంటి ఓ ఘటననే చోటు చేసుకుంది. తన పుట్టిన రోజు నాడు అద్భుతమైన క్యాచ్ అందుకున్న ఆనందంలో ఓ ఆటగాడు సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే.. అది ఫ్రీ హిట్. విషయం తెలుసుకున్న అతడు ఏం చేయాలో తెలియక ముసి ముసి నవ్వులు నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా శనివారం మెల్‌బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కాగా.. ఆ రోజు (డిసెంబర్ 23) సిడ్నిథండర్ తరుపున ఆడుతున్న పాకిస్తాన్ ఆటగాడు ఉసామా మీర్ తన 29 పుట్టిన రోజును జరుపుకున్నాడు. మెల్‌బోర్న్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. బౌలర్ స్టిక్టీ ఓ బంతిని నోబాల్ వేశాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం తరువాత బంతికి ఫ్రీ హిట్ అన్న సంగతి తెలిసిందే.
IND-W vs AUS-W : చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. ఏకైక టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా పై ఘన విజయం
క్రీజులో ఉన్న బెన్‌క్రాఫ్ట్ ఫ్రీ హిట్ బాల్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా థర్డ్ మ్యాన్ దిశగా బాల్ గాల్లోకి లేచింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఉసామా మీర్ దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఫ్రీ హిట్ అన్న సంగతి మరిచిపోయి సంబరాలు చేసుకున్నాడు. ఈ లోగా పక్కనే ఉన్న మరో ఫీల్డర్ అతడిని బాల్‌ను వికెట్ కీపర్‌కు త్రో చేయాలని సూచించగా కీపర్ వైపు మీర్ బాల్ విసిరాడు.
విషయం తెలుసుకున్న మీర్ ఏం చేయాలో అర్థం కాక ముసి ముసిగా నవ్వుకున్నాడు. ఈలోగా బ్యాటర్ బాన్‌క్రాప్ట్ రెండు పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. పుట్టిన రోజు ఆనందంలో ఫ్రీ హిట్ కూడా మరిచిపోయావా..? పార్టీ జోష్ ఇంకా తగ్గినట్లు లేదూ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Suryakumar Yadav : గాయంతో బాధపడుతున్న సూర్యకుమార్.. వీడియోతో ఆటపట్టించిన ముంబై ఇండియన్స్
The old catch off a free hit!
Unlucky, Usama ? #BBL13 pic.twitter.com/eOnQC7v8p9
— KFC Big Bash League (@BBL) December 23, 2023