West Indies sweep T20 series against South Africa (Photo: @windiescricket)
West Indies sweep T20 series : స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ క్రికెట్ టీమ్ సత్తా చాటింది. సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ట్రినిడాడ్ టరూబాలోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా తాజాగా జరిగిన మూడో టీ20లో సౌతాఫ్రికాను 8 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 13 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తుండగా వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ చెలరేగి ఆడి.. 15 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. రికెల్టన్ 27, మార్క్రం 20 పరుగులు చేశారు.
షాయ్ హోప్, నికోలస్ పూరన్ మెరుపులు
వర్షం తగ్గిన తర్వాత అంఫైర్లు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం వెస్టిండీస్‌కు 13 ఓవర్లలో 116 పరుగుల టార్గెట్ విధించారు. విండీస్ టీమ్ 9.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. షాయ్ హోప్, నికోలస్ పూరన్, షిమ్రోన్ హెట్‌మైర్ పవర్ హిట్టింగ్‌తో విండీస్ ఈజీగా విజయం సాధించింది. షాయ్ హోప్ 24 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నికోలన్ పూరన్ సిక్సర్ల ధమాకా ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. 13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 35 రన్స్ సాధించాడు. హెట్‌మైర్ 17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 31 పరుగుల చేసి నాటౌట్‌గా మిగిలాడు. సౌతాఫ్రికా బౌలర్లలో జార్న్ ఫోర్టుయిన్, ఒట్నీల్ బార్ట్‌మాన్ చెరో వికెట్ తీశారు.
షెపర్డ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
2 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన విండీస్ బౌలర్ రొమారియో షెపర్డ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 134 పరుగులు చేసిన షాయ్ హోప్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. కాగా, నికోలస్ పూరన్ 205.17 స్టైక్‌రేట్‌తో ఈ సిరీస్‌లో 12 సిక్సర్లతో 119 పరుగులు సాధించాడు. సౌతాఫ్రికా బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ 144 పరుగులతో హయ్యస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్ కేశవ్ మహరాజ్ 13 వికెట్లు పడగొట్టి బౌలర్ల లిస్టులో టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు.
Also Read: బంగ్లాదేశ్ టెస్టుల్లో అన్ని దేశాలపై గెలిచింది.. రెండు దేశాలపై తప్పా.. అవేంటో తెలుసా?
A series sweep?for the #MenInMaroon!!!?? #WIvSA #T20Fest pic.twitter.com/xKEayGpl1x
— Windies Cricket (@windiescricket) August 27, 2024