India-Pakistan match: ఈ మ్యాచులో క్రికెట్ గెలిచింది… భారత్/పాకిస్థాన్ కాదు: కపిల్ దేవ్

‘మ్యాచులో క్రికెటే గెలిచింది.. అంతేగానీ, భారత్ లేదా పాకిస్థాన్ కాదని మాత్రమే నేను చెబుతాను. ఈ మ్యాచ్ జరిగిన తీరు అద్భుతం. ఇరు జట్లూ చాలా బాగా ఆడాయి. ఏ జట్టు గెలుస్తుందో ఆ టీమ్ బాగా ఎంజాయ్ చేస్తుంది.. ఓడిపోయిన జట్టు తదుపరి మ్యాచులు గెలిచేందుకు ప్రయత్నిస్తుంది. ఇదే క్రీడా స్ఫూర్తి’ అని కపిల్ దేవ్ అన్నారు.

India-Pakistan match

India-Pakistan match: దుబాయి, షార్జాలో జరుగుతోన్న ఆసియా కప్ లో భాగంగా ఆదివారం టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఓడించిన అంశంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. ఇవాళ ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘మ్యాచులో క్రికెటే గెలిచింది.. అంతేగానీ, భారత్ లేదా పాకిస్థాన్ కాదని మాత్రమే నేను చెబుతాను. ఈ మ్యాచ్ జరిగిన తీరు అద్భుతం. ఇరు జట్లూ చాలా బాగా ఆడాయి. ఏ జట్టు గెలుస్తుందో ఆ టీమ్ బాగా ఎంజాయ్ చేస్తుంది.. ఓడిపోయిన జట్టు తదుపరి మ్యాచులు గెలిచేందుకు ప్రయత్నిస్తుంది. ఇదే క్రీడా స్ఫూర్తి’ అని కపిల్ దేవ్ అన్నారు.

కాగా, చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. భారత్ చేతిలో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 148 చేయగా, మరో రెండు బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీమిండియా అభిమానులు పండుగ చేసుకున్నారు. ఆసియా కప్ లో టీమిండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగింది.

COVID 19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 6 వేల కన్నా తక్కువగా నమోదు